Prakasham: మంత్రి సురేశ్‌ నియోజకవర్గంలో.. కంకర తేలి నరకప్రాయంగా గ్రామీణ రోడ్లు

మంత్రి ఆదిమూలపు సురేశ్‌ (Adimulapu Suresh) నియోజకవర్గ పరిధిలోని కొన్ని గ్రామాలకు వెళ్లే రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నాయి. పెద్దారవీడు మండలం సుంకేసుల, కలనూతల, గుండంచర్ల గ్రామాలకు వెళ్లే రోడ్డుపై అడుగడుగునా గోతులు, కంకర తేలడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. కొండకు అవతలివైపు ఉండే గ్రామాల నుంచి బస్సులు, కార్లు, ఆటోలు, బైకులపై రోజూ వందలాది మంది ప్రయాణిస్తుంటారు. గుంతలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ మధ్య ఓ గర్భిణీకి రోడ్డుపైనే ప్రసవమైందని గ్రామస్థులు తెలిపారు. నాలుగున్నరేళ్లుగా మంత్రికి ఎన్నిసార్లు విన్నవించినా రోడ్డు సమస్యను తీర్చలేదని ప్రజలు వాపోతున్నారు.

Updated : 28 Oct 2023 12:56 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు