pakistan: పాక్‌లో ప్రస్తుతం శ్రీలంకను మించిన ఆర్థిక కష్టాలు..!

పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం శ్రీలంకను మించిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్‌లో.. ఇప్పుడు పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఇప్పటికే డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్‌ రూపాయి మారకపు విలువ 255 రూపాయలకు చేరింది. చాలా కాలంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా నెట్టుకొస్తున్న పాక్.. పొదుపు చర్యలపైనే భారాన్ని వేసింది. ఎంపీల వేతనాల్లో 15 శాతం కోత విధించింది. విదేశీ పర్యటనలు, లగ్జరీ వాహనాల కొనుగోలుపై నిషేధం విధించింది. పాక్‌లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ఆకలి చావులు తప్పవన్న భయాందోళనలు నెలకొన్నాయి.

Updated : 27 Jan 2023 15:00 IST

Tags :

మరిన్ని