Peddireddi: మంత్రి పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలు.. పోలీసుల ఆంక్షలతో ప్రజల ఇక్కట్లు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో పోలీసులు ఆంక్షలు విధించారని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబేడ్కర్ కూడలి వద్ద సభా ప్రాంగణం ఏర్పాటు చేసి.. పరిసర ప్రాంతాల్లోకి వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. పరిసర ప్రాంతాల్లో వ్యాపార సదుపాయాలు, ప్రభుత్వాస్పత్రి ఉందని వివరించారు. పోలీసులు పాదచారులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు.

Published : 11 Oct 2023 21:48 IST

Tags :

మరిన్ని