Arshdeep Singh - MI vs PBKS: అర్ష్‌దీప్‌ దెబ్బకు ముక్కలైన వికెట్లు

పంజాబ్‌ కింగ్స్‌ మురిసింది. సామ్‌ కరన్‌ (55) విధ్వంసక బ్యాటింగ్‌కు అర్ష్‌దీప్‌ (4/29) అదిరే బౌలింగ్‌తో తోడవడంతో.. శనివారం ఆసక్తికరంగా సాగిన  భారీ స్కోర్ల మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను ఓడించింది. ముంబయికి ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరమయ్యాయి. మరీ అసాధ్యమేమీ కాదు. కానీ అర్ష్‌దీప్‌ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వలేదు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కేవలం రెండే పరుగులిచ్చి తిలక్‌, వధేరాలను బౌల్డ్‌ చేశాడు. అతడి ధాటికి ఈ రెండు సందర్భాల్లోనూ స్టంప్‌ విరిగిపోవడం విశేషం.

Updated : 23 Apr 2023 08:43 IST

Tags :

మరిన్ని