Rashid Khan: ఐపీఎల్‌ 2023లో మొదటిది.. రషీద్‌ హ్యా‘ట్రిక్స్‌’ చూశారా?

ఐపీఎల్‌ 2023 (IPL 2023)లో తొలి హ్యాట్రిక్‌ (hat-trick) నమోదైంది. కోల్‌కతా (KKR)తో మ్యాచ్‌లో గుజరాత్‌ తాత్కాలిక కెప్టెన్‌ రషీద్ ఖాన్‌ (3/37) ఈ ఘనత సాధించాడు. 205 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతాకు.. తన బంతులతో రషీద్‌ (Rashid Khan) చుక్కలు చూపించాడు. 17 ఓవర్‌ మొదటి బంతికి రస్సెల్ (1) వికెట్ కీపర్‌ భరత్‌కు చిక్కగా.. రెండో బంతికి సునీల్ నరైన్‌ (0) జయంత్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇక మూడో బంతికి శార్దూల్ ఠాకూర్‌ (0) డకౌటయ్యాడు. అయినప్పటికీ రింకూ (48*) విజృంభణ కారణంగా ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ 3 వికెట్ల తేడాతో ఓటమి చెందింది. 

Published : 09 Apr 2023 19:24 IST

Tags :

మరిన్ని