SS Rajamouli: ‘హిట్‌’కు విష్వక్‌, శేష్‌ చాలా ఉత్సాహాన్ని తీసుకొచ్చారు: రాజమౌళి

కథానాయకులుగా తెరపై ఎవరు కనిపించినా ప్రేక్షకులు చూడ్డానికి వచ్చే ఫ్రాంచైజీ ‘హిట్‌’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. అడివి శేష్‌, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘హిట్‌ 2’ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘‘విష్వక్‌ కానీ, శేష్‌ కానీ చాలా ఉత్సాహాన్ని తీసుకొచ్చారు ఈ కథలకి! ఈ ఫ్రాంచైజీలో ప్రతి సినిమా ఒకే సీజన్‌లో రావాలి. ఇది హిట్‌ సీజన్‌ అని ప్రేక్షకులకు అర్థమయ్యేలా, ప్రతి ఏడాదీ ఒకే తేదీన విడుదలయ్యేలా చూడాలి. ఇది మనందరం గర్వపడే నాణ్యమైన సినిమా’’ అన్నారు.

Published : 29 Nov 2022 17:27 IST

Tags :

మరిన్ని