AP News: శాసనసభ చరిత్రలో చీకటి రోజు: అచ్చెన్నాయుడు

తమ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, సీనియర్‌ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైకాపా సభ్యులు దాడి చేశారని అచ్చెన్నాయుడు చెప్పారు. 75 ఏళ్ల వయసున్న వ్యక్తి, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్యపై మాజీ మంత్రి వెల్లంపల్లి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘‘జీవో1 రద్దు చేయాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చాం.. దానికి స్పీకర్‌ అంగీకరించలేదు. మేం పోడియం దగ్గర నిరసన తెలిపాం. మేం తప్పు చేస్తే స్పీకర్‌ చర్యలు తీసుకుని మమ్మల్ని సస్పెండ్‌ చేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఓటమి నుంచి దృష్టి మళ్లించేందుకే ఆ పార్టీ నేతలు ఈ విధంగా దాడి చేశారు’’ అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 20 Mar 2023 11:59 IST

Tags :

మరిన్ని