వాలంటీర్ల అత్యుత్సాహం.. ఎన్నికల ప్రచారంలో వైకాపా పాటలకు చిందులు

సత్యసాయి జిల్లా పుట్టపుర్తి నియోజకవర్గంలో వాలంటీర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి ప్రచారంలో పాల్గొనడమే కాకుండా.. అధికార వైకాపా పాటలకు నృత్యాలు చేశారు. ఓడిసి మండలం చెర్లోపల్లిలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ అనిల్ కుమార్.. వైకాపా పాటలకు చిందులు వేశాడు. కొత్తచెరువు మండలం బీసీ కాలనీలో జరిగిన ప్రచారంలో వాలంటీర్ అర్షద్ పార్టీ కండువా పట్టుకుని ఈలలు వేస్తూ సహచరులతో నృత్యాలు చేశాడు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినా.. వాలంటీర్లు పట్టించుకోవడం లేదని విపక్షాలు మండిపడ్డాయి.

Updated : 20 Mar 2024 23:20 IST

Tags :

మరిన్ని