బ్లాక్‌ టీతో... ఏమవుతుందంటే...

రోజూ ఓ కప్పు బ్లాక్‌ టీ తాగడంవల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యం ఎంతో బాగుంటుంది అంటున్నారు ఎడిత్‌ కొవాన్‌ యూనివర్సిటీ నిపుణులు.

Published : 14 Jan 2023 23:48 IST

బ్లాక్‌ టీతో... ఏమవుతుందంటే...

రోజూ ఓ కప్పు బ్లాక్‌ టీ తాగడంవల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యం ఎంతో బాగుంటుంది అంటున్నారు ఎడిత్‌ కొవాన్‌ యూనివర్సిటీ నిపుణులు. ఒకవేళ టీ అలవాటు లేనివాళ్లు అదే తాగాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా ఆపిల్‌, నట్స్‌, సిట్రస్‌ పండ్లు, బెర్రీల్లో ఈ ఫ్లేవనాయిడ్లు దొరుకుతాయి అంటున్నారు. ఈ విషయమై ఎనభై దాటిన ఎనిమిది వందలమందిని పరిశీలించినప్పుడు- వాళ్ల రక్తనాళాల్లో కాల్సిఫికేషన్‌ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. శరీరంలోకెల్లా పొట్టలోని అవయవాలకీ కాళ్లకీ మంచి రక్తాన్ని అందించే రక్తనాళాన్ని పరిశీలించినప్పుడు- ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా తీసుకునేవాళ్లలో కాల్సిఫికేషన్‌ తక్కువగా ఉందట. దీని ఆధారంగానే గుండెనొప్పి, పక్షవాతం వచ్చే సూచనల్ని గుర్తిస్తారు. అంతేకాదు, వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపుని సైతం ఈ రక్తనాళం పనితీరుని బట్టి  తెలుసుకోవచ్చట. అందుకే ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా తీసుకునేవాళ్లలో పొట్ట దగ్గరుండే ఈ అతిపెద్ద రక్తనాళంలో పాచి పేరుకోవడం అనేది 40 శాతం తక్కువగా ఉందనీ, అదే సమయంలో పండ్ల రసాలూ చాకొలెట్లలోని ఫ్లేవనాయిడ్ల వల్ల అంత ఫలితం కనిపించడం లేదనీ, కాబట్టి మిగిలిన అన్నింటికన్నా బ్లాక్‌ టీలోని ఫ్లేవనాయిడ్లతోనే మెరుగైన ఫలితం ఉంటుందనేది నిపుణులు చెప్పుకొస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..