మేకలకు చలి వెయ్యకుండా...

రైతులదీ, మూగ జీవాలదీ విడదీయలేని బంధం. అందుకే వారికి వ్యవసాయమంటే ఎంత ప్రాణమో... వారితోపాటు ఉండే పశువులన్నా మేకలన్నా అంతే అభిమానం ఉంటుంది.

Published : 27 Nov 2022 00:17 IST

మేకలకు చలి వెయ్యకుండా...

రైతులదీ, మూగ జీవాలదీ విడదీయలేని బంధం. అందుకే వారికి వ్యవసాయమంటే ఎంత ప్రాణమో... వారితోపాటు ఉండే పశువులన్నా మేకలన్నా అంతే అభిమానం ఉంటుంది. అలాంటి ఆప్యాయతనే చాటుకుంటున్నాడు తమిళనాడుకు చెందిన ఓ రైతు. తంజావూర్‌ జిల్లా కులమంగళం గ్రామానికి చెందిన డెబ్భై ఏళ్ల గణేశ్‌కి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఒకవైపు సాగు చేస్తూనే పశువుల్నీ మేకల్నీ పెంచుతున్నాడు. అయితే ఒకసారి అడవికి తీసుకెళ్లిన మేకలు వర్షానికి తడిసి వణికిపోవడం గమనించిన గణేశ్‌ వాటికోసం ఏదైనా చేయాలనుకున్నాడు. ఖాళీగా పడి ఉన్న బియ్యం బస్తాలను కత్తిరించి వాటికి కొన్ని తాళ్లు కుట్టి- మేకలకు ఆ సంచుల్ని చుట్టి తాళ్లను ముడి వేస్తున్నాడు. అలా తన వద్ద ఉన్న యాభై మేకలకు చాలాకాలంగా వర్షాకాలం, చలికాలంలో ఇలా చలికోట్లు వేస్తున్నాడు గణేశ్‌. తనకు తోచిన ఆలోచనతో మూగ జీవాల పట్ల ప్రేమను చాటుకుంటున్న గణేశ్‌ని ఆ గ్రామస్తులంతా అభినందించడంతోపాటు మిగతా మేకల కాపర్లూ అదే దారిలో నడుస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..