సంక్రాంతి కొలువు

రంగురంగుల రంగవల్లులూ, భోగి మంటలూ, భోగి పండ్లూ, హరిదాసుల సంకీర్తనలూ, గొబ్బెమ్మలూ, గంగిరెద్దులూ, గాలిపటాలూ, కోడి పందేలు... అన్నీ కలిస్తేనే పెద్ద పండుగ... అదే సంక్రాంతి. ఏడాది తొలినాళ్లలో పవిత్ర ధనుర్మాసంలో మూడు రోజుల పాటు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ ఇది.

Published : 07 Jan 2023 23:33 IST

సంక్రాంతి కొలువు

రంగురంగుల రంగవల్లులూ, భోగి మంటలూ, భోగి పండ్లూ, హరిదాసుల సంకీర్తనలూ, గొబ్బెమ్మలూ, గంగిరెద్దులూ, గాలిపటాలూ, కోడి పందేలు... అన్నీ కలిస్తేనే పెద్ద పండుగ... అదే సంక్రాంతి. ఏడాది తొలినాళ్లలో పవిత్ర ధనుర్మాసంలో మూడు రోజుల పాటు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ ఇది.

ఈ సందర్భంగా చాలా ప్రాంతాల్లో బొమ్మల కొలువునూ ఏర్పాటు చేస్తున్నారు. ముంగిట్లో ఓ పక్కన పల్లె సౌందర్యం, రైతుల శ్రమైక జీవితం, పండుగ విశేషాలకు అద్దంపట్టే అందమైన బొమ్మలను కొలువుతీర్చి- పిల్లలకు మన సంప్రదాయాలూ విలువలను చెప్పకనే చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం పూట బొమ్మల కొలువు ఏర్పాటు చేసి, నైవేద్యంగా పిండి వంటలు పెట్టి వాయినాలు ఇచ్చుకోవడం ఆనవాయితీ. కేవలం దసరా పండుగ సమయంలోనే కనిపించే బొమ్మల వేడుకలు ఇప్పుడు పల్లె శోభను సంతరించుకుని సంక్రాంతి సంబరాలకు కొత్త కళను తీసుకొస్తున్నాయి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..