Krishnapatnam port: ప్రభుత్వ పరిశీలనకు ‘కృష్ణపట్నం’ ప్రతిపాదన

కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్వహణను ప్రైవేటుకు అప్పగించే ప్రతిపాదనలపై ఏపీ జెన్‌కో ముందుకే వెళ్తోంది. ఉద్యోగసంఘాల ఆందోళనను పట్టించుకోవట్లేదు.

Updated : 29 Nov 2022 07:47 IST

ఈనాడు, అమరావతి: కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్వహణను ప్రైవేటుకు అప్పగించే ప్రతిపాదనలపై ఏపీ జెన్‌కో ముందుకే వెళ్తోంది. ఉద్యోగసంఘాల ఆందోళనను పట్టించుకోవట్లేదు. నష్టాలను సాకుగా చూపుతూ ప్లాంటును ప్రైవేటుకు అప్పగించేందుకు ముందుకే వెళ్తోంది. కృష్ణపట్నంలో కొత్తగా నిర్మాణం పూర్తయిన 800 మెగావాట్ల ప్లాంటును గత నెల 27న సీఎం జగన్‌ జాతికి అంకితం చేశారు. ఈ ప్లాంటు ఇంకా వాణిజ్య ఉత్పత్తి (సీఓడీ) లోకి రాకముందే... థర్మల్‌ కేంద్రంలోని మూడు యూనిట్లను ప్రైవేటుకు అప్పగించేలా దస్త్రాలు కదులుతున్నాయి. ఈమేరకు టెండర్లు పిలవాలని సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.

ప్రకటన జారీ చేస్తే ఊరుకోం: ఉద్యోగ సంఘాలు

కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ప్రైవేటుకు అప్పగించే నిర్ణయంపై ప్రభుత్వం ముందుకు వెళ్తే సమ్మె చేయడానికి వెనుకాడేది లేదని ఉద్యోగసంఘాల నేతలు పేర్కొన్నారు. నిరసనలకు సంబంధించిన సమ్మె నోటీసును యాజమాన్యానికి ఉద్యోగసంఘాలు అందించాయి. టెండరు ప్రకటన జారీచేస్తే దశలవారీగా ఆందోళనలు చేస్తామని, అవసరమైతే పూర్తిగా సమ్మెలోకి వెళ్తామని ఉద్యోగసంఘాల నేతలు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని