నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వైభవంగా జరగనుంది. దశాబ్ది ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సచివాలయంలో ప్రారంభించనున్నారు.

Published : 02 Jun 2023 04:28 IST

సచివాలయంలో జాతీయజెండా ఎగురవేయనున్న సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వైభవంగా జరగనుంది. దశాబ్ది ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సచివాలయంలో ప్రారంభించనున్నారు. తొలుత గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం నివాళులర్పిస్తారు. అనంతరం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ చేసి, దశాబ్ది ఉత్సవ సందేశం ఇస్తారు. రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు కొనసాగుతాయి. 21 రోజుల పాటు జరిగే దశాబ్ది ఉత్సవాల్లో వివిధ రంగాల్లో రాష్ట్రప్రగతిని వివరిస్తారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉంటాయి. ఉత్సవాలను పురస్కరించుకొని సచివాలయం, శాసనసభ, మండలి, బీఆర్‌కే భవన్‌, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలను విద్యుత్‌దీపాలతో అలంకరించారు. కాంగ్రెస్‌, భాజపా ఆధ్వర్యంలోనూ రాష్ట్ర అవతరణ వేడుకలు జరగనున్నాయి. రాజ్‌భవన్‌లో నిర్వహించే వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై పాల్గొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు