శ్రీసత్యసాయి జిల్లాలో కలకలం రేపుతున్న చిరుత మరణాలు

శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుతల వరుస మరణాలు చర్చనీయాంశమయ్యాయి. బుధవారం ఒక ఆడ చిరుత కళేబరాన్ని గుర్తించగా.. గురువారం అదే ప్రాంతంలో మరో మగ చిరుత ప్రాణాలు కోల్పోయి కనిపించింది.

Updated : 18 Aug 2023 07:38 IST

వరుసగా రెండో రోజు కళేబరం లభ్యం

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుతల వరుస మరణాలు చర్చనీయాంశమయ్యాయి. బుధవారం ఒక ఆడ చిరుత కళేబరాన్ని గుర్తించగా.. గురువారం అదే ప్రాంతంలో మరో మగ చిరుత ప్రాణాలు కోల్పోయి కనిపించింది. ఈ ఘటనలు జరిగిన మడకశిర మండలం మెళవాయి గ్రామ సమీపంలోని కాకులకొండను జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్‌ఓ) రవీంద్రరెడ్డి, ఇతర అధికారులు పరిశీలించారు. చిరుతలు చనిపోయిన ప్రాంతానికి సమీపంలో వారికి మేక కళేబరం కనిపించడంతో దాని నుంచి శాంపిళ్లను సేకరించారు. రెండు చిరుత కళేబరాలకు స్థానిక అటవీశాఖ కార్యాలయంలో పంచనామా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ మాట్లాడుతూ రెండు చిరుతలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయని, శాంపిళ్ల నివేదిక ఆధారంగా మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. పిల్లలను కోల్పోయిన తల్లి చిరుత కోపంతో దాడి చేసే అవకాశముందని.. స్థానికులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని