విజయవాడ-చెన్నై మధ్య వందేభారత్‌ పరుగులు ఎప్పుడు?

విజయవాడ-చెన్నై మధ్య వందేభారత్‌ రైలు ఎప్పటి నుంచి పరుగులు పెడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

Updated : 09 Sep 2023 06:56 IST

ఈనాడు, అమరావతి, చెన్నై: విజయవాడ-చెన్నై మధ్య వందేభారత్‌ రైలు ఎప్పటి నుంచి పరుగులు పెడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. జులై 7న దేశవ్యాప్తంగా 5 వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌గా ప్రధాని ప్రారంభించే సమయంలో ఈ రైలూ అందులో ఉందని అప్పట్లో రైల్వేశాఖ అధికారులు పేర్కొన్నారు. దీనికి 20687/88 నంబరూ కేటాయించారు. చివరకు రైలు ప్రారంభం వాయిదా వేశారు. ఎప్పుడు పట్టాలెక్కుతుందో అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఈ రైలును తొలుత చెన్నై కేంద్రంగా ఉండే దక్షిణ రైల్వే.. చెన్నై సెంట్రల్‌-తిరుపతి మధ్య నడపాలని భావించింది. రెండు స్టేషన్ల మధ్య దూరం తక్కువ కావడంతో.. చెన్నై-తిరుపతి-విజయవాడ మధ్య నడపాలని దక్షిణ మధ్య రైల్వే జోన్‌ కోరింది. అలాగే రైలు ఎవరు నిర్వహిస్తారనేది తేలలేదు. ఈ మార్గం.. దక్షిణ రైల్వే జోన్‌ పరిధిలో తక్కువ, దక్షిణ మధ్య రైల్వే జోన్‌ (సికింద్రాబాద్‌)లో ఎక్కువగా ఉంది. ఈ రైలుతో తమ జోన్‌ పరిధిలో వచ్చే కొద్దిపాటి రాబడితో నిర్వహణ సాధ్యం కాదని దక్షిణ రైల్వే చెబుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నిర్వహణను దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు కేటాయించి, విజయవాడ డివిజన్‌కు అప్పగిస్తారా? అనేది తేలాల్సి ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని