Kadapa: ఒక్క ఛాన్స్‌ ఇచ్చినందుకు.. ఆకులు కట్టుకు తిరుగుతున్నాం

వైకాపాకు ఒకసారి ఓటేసినందుకు ఆదిమానవుల అవతారం ఎత్తాల్సి వచ్చిందని సీఎం జగన్‌ సొంత ఇలాకా వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 10 Jan 2024 06:57 IST

వైకాపాకు ఒకసారి ఓటేసినందుకు ఆదిమానవుల అవతారం ఎత్తాల్సి వచ్చిందని సీఎం జగన్‌ సొంత ఇలాకా వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చకపోవడంతో మంగళవారం కడపలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆకులు కట్టుకుని ప్రధాన రహదారుల వెంట ఇలా ప్రదర్శన చేపట్టారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రప్రభుత్వ శవయాత్రను నిర్వహించి దహనక్రియలు జరిపారు. ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

న్యూస్‌టుడే, కడప నగరపాలక సంస్థ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని