విశాఖ ఉక్కుకు రూ.63 కోట్ల కోత

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.63 కోట్లు కోతపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.683 కోట్ల మేర ఉన్న కేటాయింపులను 2024-25లో రూ.620 కోట్లకు తగ్గించింది.

Updated : 02 Feb 2024 06:38 IST

విద్యాసంస్థలకు కేటాయింపులను ప్రత్యేకంగా ప్రస్తావించని ఆర్థిక మంత్రి

ఈనాడు, దిల్లీ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.63 కోట్లు కోతపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.683 కోట్ల మేర ఉన్న కేటాయింపులను 2024-25లో రూ.620 కోట్లకు తగ్గించింది.

  • విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌ కేటాయింపుల్లోనూ భారీగా కోతపెట్టింది. 2023-24లో రూ.337.69 కోట్లు కేటాయించి రూ.276 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టిన ప్రభుత్వం.. 2024-25లో కేటాయింపులను రూ.150 కోట్లకు పరిమితం చేసింది. ఇది గత బడ్జెట్‌ అంచనాల కంటే రూ.187.69 కోట్లు, సవరించిన అంచనాల కంటే రూ.126 కోట్లు తక్కువ.
  • ఏపీ, తెలంగాణల్లో ఏర్పాటుచేస్తున్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాలకు ప్రత్యేకంగా ఎన్ని నిధులు ఇవ్వనుందో ప్రస్తావించలేదు. దేశవ్యాప్తంగా కేంద్ర విశ్వవిద్యాలయాలకు కలిపి రూ.15,928 కోట్లు కేటాయించింది. అందులోనే తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలకూ కేటాయింపులుంటాయి. ఇక్కడి వర్సిటీలకు నిర్దిష్టంగా ఎంత దక్కనుందన్నది స్పష్టత లేదు.
  • విశాఖపట్నంలో నెలకొల్పిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎనర్జీకి రూ.168 కోట్లు కేటాయించింది. 2023-24లోనూ ఇంతే ప్రకటించినప్పటికీ అంచనాల సవరణ నాటికి రూ.90 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. దాదాపు రూ.78 కోట్లు మిగిలిపోయాయి.
  • ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఎయిమ్స్‌లకూ దేశవ్యాప్తంగా అన్నింటికి కలిపి కేటాయించడం వల్ల ఏపీలోని ఆయా సంస్థలకు ప్రత్యేకంగా రానున్న నిధులెన్ని అన్నది తేలాల్సి ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని