విదేశీ రుణంతో చేపట్టే ఏపీ ప్రాజెక్టులకు రూ.2,121 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. వివిధ విదేశీ ఆర్థిక సంస్థల రుణాలతో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం ఈ మధ్యంతర బడ్జెట్‌లో రూ.2,121.87 కోట్లు కేటాయించింది.

Updated : 02 Feb 2024 06:09 IST

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. వివిధ విదేశీ ఆర్థిక సంస్థల రుణాలతో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం ఈ మధ్యంతర బడ్జెట్‌లో రూ.2,121.87 కోట్లు కేటాయించింది. మొత్తం అయిదు ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఏఐఐబీ, జపాన్‌ ప్రభుత్వం, ఎన్‌డీబీ, ఐబీఆర్‌డీ లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం తీసుకుంటోంది. వాటన్నింటికీ కలిపి ఈ సంస్థలు ఇప్పటివరకు రూ.2,646.77 కోట్లు విడుదల చేశాయి. ఇప్పుడు ఈ బడ్జెట్‌లో కేంద్రం మరో రూ.2,121 కోట్ల కేటాయింపులు చేసింది.

  • ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ రహదారి ప్రాజెక్టుకు ఏఐఐబీ (ఏసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు) రుణం కింద రూ.221.87 కోట్లు మంజూరు
  • ఏపీ ఇరిగేషన్‌ అండ్‌ లైవ్లీహుడ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు రెండో దశకు జపాన్‌ ప్రభుత్వం రుణం కింద రూ.300 కోట్ల రుణం కేటాయింపు
  • ఆంధ్రప్రదేశ్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆపరేషన్‌కు ఐబీఆర్‌డీ రుణం కింద రూ.300 కోట్లు మంజూరు
  • ఆంధ్రప్రదేశ్‌ రోడ్స్‌ అండ్‌ బ్రిడ్జెస్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టుకు ఎన్‌డీబీ (నేషనల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు) రుణం కింద రూ.650 కోట్లు కేటాయింపు
  • ఏపీ మండల్‌ కనెక్టివిటీ, రూరల్‌ కనెక్టివిటీ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టుకు ఎన్‌డీబీ రుణం కింద రూ.650 కోట్లు కేటాయింపు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని