రాష్ట్ర మంత్రికి వర్తించే.. ప్రవర్తనా నియమావళే ప్రభుత్వ సలహాదారులకు

రాష్ట్ర మంత్రికి వర్తించే ఎన్నికల ప్రవర్తనా నియమావళే ప్రభుత్వ సలహాదారులకు వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Published : 17 Apr 2024 02:48 IST

కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: రాష్ట్ర మంత్రికి వర్తించే ఎన్నికల ప్రవర్తనా నియమావళే ప్రభుత్వ సలహాదారులకు వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులై రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుంచి జీతభత్యాలు పొందుతున్న దాదాపు 40 మంది సలహాదారులకు ఇది వర్తిస్తుందని మంగళవారం ఆదేశాలనిచ్చింది. ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనకు సంబంధించి ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు అందాయని అందులో పేర్కొంది. నిర్దేశిత పనికి బదులు రాజకీయ ప్రచారంలోకి ప్రవేశిస్తున్నారని, ప్రతిపక్షాలను విమర్శిస్తూ విలేకరుల సమావేశాలను నిర్వహిస్తున్నారని గుర్తించినట్లు ఈసీ వివరించింది. మంత్రుల మాదిరే వీరికి కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని, ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తూ సంబంధిత చట్టాలకు లోబడి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు