Adani Group: ఎఫ్‌పీఓపై వెనక్కి తగ్గిన అదానీ.. పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించనున్నట్లు వెల్లడి!
మార్కెట్లో నెలకొన్న అస్థిరత దృష్ట్యా ఎఫ్‌పీఓ సబ్‌స్క్రిప్షన్‌తో ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.
ముంబయి: అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises) ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO) ద్వారా సేకరించిన నిధులను ఖర్చు చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు కంపెనీ బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న అస్థిరత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఎఫ్‌పీఓ ద్వారా సేకరించిన మొత్తాన్ని తిరిగి చెల్లించడంతోపాటు, లావాదేవీలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు అదానీ గ్రూప్ (Adani Group) ఒక ప్రకటనలో తెలిపింది.
‘‘ఎఫ్‌పీవో సందర్భంగా సంస్థపై నమ్మకం ఉంచి, అండగా నిలిచిన ప్రతి పెట్టుబడిదారుడి కృతజ్ఞతలు. మంగళవారం ఎఫ్‌పీఓ సబ్స్క్రిప్షన్ విజయవంతమైంది. అయితే, గత వారం రోజులుగా షేర్లలో అస్థిరత నెలకొన్నప్పటికీ సంస్థ వ్యాపార నిర్వహణపై నమ్మకం ఉంచి పెట్టుబడి పెట్టినందుకు ధన్యవాదాలు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పెట్టుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎఫ్పీఓతో ముందు సాగకూడదని అదానీ ఎంటర్ప్రైజెస్ బోర్డు నిర్ణయించింది’’ అని ప్రకటించింది.
ప్రస్తుతం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు బలమైన బ్యాలెన్స్ షీట్, సురక్షితమై ఆస్తులు ఉన్నాయని తెలిపింది. అదే సమయంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడంలో సంస్థకు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉందని పేర్కొంది. ఎఫ్పీఓతో ముందుకు వెళ్లకూడదని తీసుకున్న నిర్ణయం సంస్థపై, కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపదని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్‌గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్‌మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్‌కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్‌ను పరిచయం చేయడం కోసం ఐహెచ్‌జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్‌తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల