Air India: ఎయిరిండియాపై డీజీసీఏ చర్యలు..!

Air India: ఎయిరిండియాలో కొన్ని అంశాల్లో లోపాలను గుర్తించిన డీడీజీఏ కఠిన చర్యలు తీసుకుంది.

Updated : 21 Sep 2023 15:12 IST

దిల్లీ: ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెబుతూ.. ఎయిరిండియా (Air India)కు డీజీసీఏ (DGCA) కఠిన సందేశం పంపింది. ఈ విషయంలో కొన్ని లోపాలను గుర్తించి ఎయిరిండియా (Air India) భద్రతా విభాగాధిపతిపై నెలరోజుల పాటు సస్పెన్షన్‌ వేటు వేసింది.

జులై 25-26 మధ్య ఎయిరిండియా (Air India)లో తనిఖీలు నిర్వహించినట్లు డీజీసీఏ (DGCA) తెలిపింది. అంతర్గత ఆడిట్‌, ప్రమాద నివారణ, తగినంత మంది సాంకేతిక నిపుణులు వంటి అంశాల్లో ఎయిరిండియా ఏ మేరకు నిబంధనలు పాటిస్తుందో పరిశీలించినట్లు పేర్కొంది. ప్రమాదాల నివారణ విషయంలో కొన్ని లోపాలను గుర్తించింది. అలాగే సాంకేతిక నిపుణుల సంఖ్య సైతం నిబంధనలకు అనుగుణంగా లేదని వెల్లడించింది. మరోవైపు అంతర్గతంగా కంపెనీ చేపట్టాల్సిన కొన్ని తనిఖీల్లో కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు గమనించింది. దీనిపై కంపెనీకి షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది.

నోటీసులపై ఎయిరిండియా (Air India)లోని ఆయా విభాగాధిపతులు స్పందించినట్లు డీజీసీఏ (DGCA) వెల్లడించింది. వాటిని సమీక్షించిన తర్వాత ఎయిరిండియా సేఫ్టీ చీఫ్‌పై నెలరోజుల పాటు సస్పెన్షన్‌ వేటు వేసినట్లు పేర్కొంది. ప్రయాణికుల భద్రతకు డీజీసీఏ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా గత ఏడాది ఓ సందర్భంలో తెలిపారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని