Sundar Pichai : వావ్‌.. గూగుల్ సీఈవో సుందర్‌ పిచాయ్‌ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!

బెంగళూరుకు (Bengaluru) చెందిన ఓ టెకీ (Techie) అమెరికా (America) వెళ్లారు. శాన్‌ఫ్రాన్సిస్కో వీధుల్లో గూగుల్ (Google) సీఈవో సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) ఆయనకు ఎదురు కావడంతో ఆశ్చర్యపోయారు.

Updated : 26 Sep 2023 16:19 IST

Image : PuriSid

ఇంటర్నెట్‌ డెస్క్ : సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai).. ఐటీ రంగం నిపుణులకు స్ఫూర్తినిచ్చే పేరు. భారత్‌ (India) నుంచి అమెరికా (America) వెళ్లి అక్కడి దిగ్గజ కంపెనీల్లో ఒకటైన గూగుల్‌కు సీఈవో అయ్యారు. అలాంటి టెక్‌ టైటాన్‌ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా అమెరికా వీధుల్లో తిరుగుతుంటారని ఎవరు ఊహిస్తారు చెప్పండి. అయితే, ఓ బెంగళూరు టెకీకి ఆయన అలా ఎదురుకావడంతో ఆశ్చర్యపోయారు. వెంటనే సార్‌ మీతో ఓ ఫొటో తీసుకోవచ్చా అని అడిగారు. దానికి పిచాయ్‌ కూడా ఓకే చెప్పారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సుందర్‌ పిచాయ్‌ సింప్లిసిటీని మెచ్చుకుంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

₹12వేలకే లావా 5జీ ఫోన్‌.. రిపేరైతే ఇంటికొచ్చి సర్వీస్‌!

బెంగళూరుకు చెందిన టెకీ సిద్‌ పురి రీటూల్ అనే కంపెనీలో పనిచేస్తున్నారు. గత వారం ఆయన ఆమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లారు. అక్కడ సరదాగా వాకింగ్ చేస్తుండగా గూగుల్ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కనిపించారు. సిద్‌ వెంటనే సుందర్‌ పిచాయ్‌ను రిక్వెస్ట్‌ చేసి ఓ ఫొటో దిగారు. ఆ ఫొటోను సిద్‌ తాజాగా ట్విటర్‌, లింక్డ్‌ ఇన్‌లో పోస్టు చేయగా.. అది వైరల్‌గా మారింది. ఫొటోలో సుందర్‌ పిచాయ్‌ బ్లూ జీన్స్‌, జాకెట్, బ్లాక్‌ సన్‌ గ్లాసెస్‌ ధరించి కనిపిస్తున్నారు. దాంతో సుందర్‌ పిచాయ్‌ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సెక్యూరిటీ ఎవరూ లేరా? అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. తోడుగా ఉన్న ఒకే ఒక సెక్యూరిటీ ఆ ఫొటో తీశాడని సిద్‌ బదులిచ్చారు. 

‘వావ్‌ సుందర్‌ పిచాయ్‌ ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే అక్కడి వీధుల్లో నడుస్తున్నారా? ఆయన సాదాసీదాగా కనిపించడం చూస్తే సంతోషంగా ఉంది. అయితే సెక్యూరిటీ లేకుండా తిరగడం కొంత ఆందోళన కూడా కలిగిస్తోందని’ ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు. ‘ఆయన పిక్సెల్ 8 ఫోన్‌ వాడుతున్నారా?’ అని మరో నెటిజన్‌ సరదాగా చమత్కరించాడు. మదురైలో పుట్టిన సుందర్‌ పిచాయ్‌ ఐఐటీ ఖరగ్‌పుర్‌లో ఇంజినీరింగ్‌ చదివారు. ఆ తరువాత అమెరికా వెళ్లి గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో స్థాయికి ఎదిగారు. 

 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని