Ather 450S: ఓలాకు పోటీగా ఏథర్‌ ఎంట్రీ లెవల్‌ స్కూటర్‌.. ధర, ఫీచర్లు ఇవే..!

Ather Energy 450S details: ఏథర్‌ ఎనర్జీ కొత్తగా 450 ఎస్‌ మోడల్‌ను లాంచ్‌ చేసింది. ఓలా ఎస్‌1 ఎయిర్‌కు పోటీగా దీన్ని తీసుకొచ్చింది. 

Updated : 13 Nov 2023 16:54 IST

దిల్లీ: విద్యుత్‌ ద్విచక్ర వాహన మార్కెట్లో పోటీకి తెరలేపుతూ ఏథర్‌ ఎనర్జీ సంస్థ (Ather Energy) మరో కొత్త ఈవీని లాంచ్‌ చేసింది. ఓలా (Ola EV) ఎంట్రీ లెవల్‌ స్కూటర్‌ ఎస్‌1 ఎయిర్‌కు (S1 Air) పోటీగా ఏథర్‌ 450Sను (Ather 450S) తీసుకొచ్చింది. దీని ధరను రూ.1.29 లక్షలుగా నిర్ణయించింది. దీంతో పాటు ఇప్పటికే ఉన్న స్కూటర్లకు అదనపు ఫీచర్లను జోడించింది.

కొత్తగా తీసుకొచ్చిన ఏథర్‌ 450Sలో 2.9 kWh బ్యాటరీ ఇస్తున్నారు. సింగిల్‌ ఛార్జింగ్‌తో 115 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ఈ స్కూటర్‌ టాప్‌ స్పీడ్‌ గంటకు 90 కిలోమీటర్లని ఏథర్‌ ఎనర్జీ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ఇప్పటికే ఉన్న 450X మోడల్‌ ఇకపై రెండు ఆప్షన్లతో వస్తుంది. ఒకటి సింగిల్‌ చార్జింగ్‌తో 115 కిలోమీర్ల రేంజ్‌ పనిచేస్తుంది. దీని ధరను కంపెనీ రూ.1.37 లక్షలుగా నిర్ణయించింది. 145 కిలోమీటర్ల రేంజ్‌ కలిగిన మోడల్‌ ధరను రూ.1.44 లక్షలుగా పేర్కొంది.

మూడేళ్ల తర్వాత హానర్‌ రీ ఎంట్రీ.. త్వరలోనే స్మార్ట్‌ఫోన్‌!

కొత్తగా తీసుకొచ్చిన వాహనంతో 450 శ్రేణిలో మూడు రకాల వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అయ్యిందని ఏథర్‌ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో తరుణ్‌ మెహతా తెలిపారు. ఇవి వేర్వేరు ధరల శ్రేణిలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఎంట్రీ లెవల్‌ మోడల్‌ అయినప్పటికీ 450 క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడలేదని మెహతా పేర్కొన్నారు. 450Sలో పార్క్‌ అసిస్టెంట్‌, ఆటో హోల్డ్‌, సైడ్‌ స్టాండ్‌ సెన్సర్‌, ఆటో ఇండికేటర్‌ కటాఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 450Xలో 7 అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే అందిస్తుండగా.. 450Sలో మాత్రం 7 అంగుళాల డీప్‌వ్యూ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో గూగుల్‌ మ్యాప్స్ కాకుండా టర్న్‌ బై టర్న్‌ నావిగేటర్‌ ఇస్తున్నారు.

దశలవారీగా స్కూటర్ల డెలివరీని ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. 450X మోడల్‌ 2.9 kWh బ్యాటరీ వేరియంట్‌ డెలవరీలు ఆగస్టు మూడో వారం నుంచి; 450S స్కూటర్‌ను ఆగస్టు చివరి వారంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. 450X మోడల్‌ 3.7 kWh బ్యాటరీ కెపాసిటీ కలిగిన వాహనాల డెలివరీని అక్టోబర్‌ నుంచి ప్రారంభించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని