Cashless Claim: నగదు రహిత ఆరోగ్య బీమా ఉందని ధీమాగా ఉన్నారా? ఈ సవాళ్లు ఎదురవ్వొచ్చు!
నగదు రహిత సదుపాయంతో బీమా సంస్థలే నేరుగా ఆసుపత్రికి బిల్లు మొత్తాన్ని చెల్లిస్తాయి. పాలసీదారుడు చెల్లించాల్సిన పని ఉండదు. మరి అన్ని సార్లు ఇది పని చేస్తుందా?
ఇంటర్నెట్ డెస్క్: వైద్యం కోసం పాలసీదారుడు ఆసుపత్రిలో చేరినప్పుడు.. పాలసీదారుడు బిల్లు మొత్తాన్ని చెల్లించి ఆ తర్వాత బీమా సంస్థ నుంచి క్లెయిం చేసుకోవాలి. అయితే, నగదు రహిత సదుపాయంతో బీమా సంస్థలే నేరుగా ఆసుపత్రికి బిల్లు మొత్తాన్ని చెల్లిస్తాయి. పాలసీదారుడు చెల్లించాల్సిన పని ఉండదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. అలాగే, సాధారణ క్లెయిం మాదిరిగా ముందుగా సొమ్ము చెల్లించి తిరిగి వస్తుందా? లేదా? అని ఆందోళన ఉండదు. అందుకే నగదు రహిత చికిత్సలను అందించే పాలసీలను ఎంచుకోమని నిపుణులు సూచిస్తుంటారు. అయితే, నగదు రహిత పాలసీల విషయంలోనూ పాలసీదారులు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. అవేంటో తెలుసుకుని జాగ్రత్త పడితే.. అత్యవసర సమయాల్లో ఇబ్బందులు తొలగించుకోవచ్చు.
పాక్షిక క్లెయిం సెటిల్మెంట్
నగదు రహిత బీమాలో ఎదురయ్యే అతిపెద్ద సమస్య పాక్షిక క్లెయిమ్ సెటిల్మెంట్. ఇది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఏదైనా అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరినప్పుడు చికిత్సకు అయిన ఖర్చులో నిర్దిష్ట భాగాన్ని మాత్రమే నగదు రహితంగా బీమా సంస్థ కవర్ చేస్తుంది. పెండింగ్ మొత్తాన్ని పాలసీదారుడు చెల్లించి తర్వాత బీమా సంస్థ నుంచి క్లెయిం చేసుకోవాలి.
ఉదాహరణకు పాలసీదారుడు శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు. ఇందుకోసం అయిన బిల్లు రూ. 30 వేలను నగదు రహిత సదుపాయంతో బీమా సంస్థ చెల్లించింది. ఆపరేషన్ తర్వాత కాంప్లికేషన్లు రావడంతో మరికొంత కాలం ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. అప్పుడు మొత్తం బిల్లు రూ. 40 వేలు అయ్యిందనుకుంటే.. మిగిలిన రూ. 10 వేలు నగదు రహితంగా క్లెయిం చేయడం కుదరకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో పాలసీదారుడు స్వయంగా బిల్లు చెల్లించి తర్వాత రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
నెట్వర్క్ ఆసుప్రతులు..
నగదు రహిత చికిత్సను పొందేందుకు బీమా సంస్థతో టైఅప్ ఉన్ననెట్వర్క్ ఆసుపత్రిలో మాత్రమే చేరాల్సి ఉంటుంది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో నెట్వర్క్ ఆసుపత్రి అందుబాటులో లేక వేరే ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటే నగదు రహిత సదుపాయం లభించదు. చికిత్స కోసం చేసిన ఖర్చులను పాలసీదారుడే స్వయంగా చెల్లించి.. ఆ తర్వాత రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందువల్ల, పాలసీ తీసుకునే ముందు పాలసీదారుడు నెట్వర్క్ ఆసుప్రతుల జాబితాను తనిఖీ చేయాలి. నివాస ప్రాంతానికి దగ్గరలో నెట్వర్క్ ఆసుపత్రి ఉన్న పాలసీని ఎంచుకోవడం మంచిది.
డాక్యుమెంటేషన్..
నగదు రహిత చికిత్సలు పొందడం కోసం కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రీ-ఆథరైజేషన్ ఫారం టీపీఏ (థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్)కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చికిత్స సమయంలో, ఆ తర్వాత కూడా కొన్ని డాక్యుమెంట్లను సమర్పించాల్సి రావచ్చు. అత్యవసర పరిస్థితుల కారణంగా డాక్యుమెంట్లను సకాలంలో ఇవ్వడంలో పాలసీదారులు విఫలం కావచ్చు. ఫలితంగా నగదు రహిత క్లెయిం పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. గుర్తింపు కోసం టీపీఏ అందించే హెల్త్‌కార్డులను ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవడం మంచిది. అలాగే, చికిత్స కోసం ప్రణాళిక ప్రకారం ఆసుపత్రిలో చేరితే ఆథరైజేషన్ ఫారంతో పాటు అన్ని డాక్యుమెంట్లను ముందుగానే సమర్పించడం మంచిది.
క్లెయిం ప్రక్రియలో జాప్యం..
అత్యవసర సందర్భాల్లో నగదు రహిత క్లెయిం పరిష్కారం సవాలుగా మారుతుందనే చెప్పాలి. కొన్ని చికిత్సలు వెంటనే చేయాల్సి రావచ్చు. ఆలస్యం కాకుండా ఉండేందుకు బిల్లులను వెంటనే చెల్లించమని వైద్యులు కోరవచ్చు. అలాంటి సందర్భంలోనూ స్వయంగా డబ్బు చెల్లించి, రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఆన్లైన్ ద్వారా త్వరగా నగదు రహిత క్లెయింలను పరిష్కరించగల, బలమైన నెట్వర్క్ ఉన్న బీమా సంస్థలను ఎంచుకోవడం మంచిది.
మినహాయింపులు..
కొన్ని చికిత్సలు నగుదు రహిత క్లెయింల కింద మినహాయిస్తారు. ఇవి పాలసీను బట్టి మారుతుంటాయి. డాక్యుమెంటేషన్ ఛార్జీలు, రెగ్యులర్ చెక్-అప్లు, ప్రత్యేక వైద్య పరీక్షలు వంటివి నగదు రహిత క్లెయింల పరిధిలోకి రాకపోవచ్చు. కాబట్టి, పాలసీదారులు ముందుగానే మినహాయింపుల గురించి తెలుసుకోవాలి.
చివరిగా..
ఆరోగ్య బీమా క్లెయింల విషయంలో తప్పు బీమాసంస్థ, టీపీఏ, పాలసీదారుడు ఎవరు చేసినా అంతిమంగా నష్టపోయేది పాలసీదారుడే. అందువల్ల పాలసీ తీసుకున్నప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నెట్ వర్క్ ఆసుపత్రులు, పాలసీ కవర్ చేసే వ్యాధుల జాబితా, మినహాయింపులు వంటివి తెలుసుకోవాలి. అలాగే క్లెయిం చేసేటప్పుడు బీమా సంస్థ నిర్దేశించిన ప్రోటోకాల్‌ను అనుసరించడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్‌లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్‌లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్‌కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్‌స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు