క్యాన్సిల్‌ చేసుకున్న ఫ్లాట్‌పై జీఎస్‌టీ రీఫండ్‌ పొందొచ్చా?

అన్‌రిజిస్టర్డ్‌ కొనుగోలుదారులు, వారి పాన్‌ నంబరు ద్వారా జీఎస్‌టీ పోర్టల్‌లో తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలుంది.

Published : 30 Dec 2022 20:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్లాట్‌ బుకింగ్‌, బీమా పాలసీల రద్దుకు సంబంధించి జీఎస్‌టీ పోర్టల్‌లో నమోదు కాని వ్యక్తులు కూడా (చాలా వరకు వ్యక్తిగత కస్టమర్లు) జీఎస్‌టీ (వస్తు సేవల పన్ను) వాపసును క్లెయిం చేసుకోవచ్చని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండైరెక్ట్‌ ట్యాక్సెస్ & కస్టమ్స్‌ (సీబీఐసీ) తన సర్క్యులర్‌లో పేర్కొంది. అయితే, ఇందుకోసం జీఎస్‌టీ పోర్టలో తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

జీఎస్‌టీ పోర్టల్‌లో ‘రీఫండ్‌ ఫర్‌ అన్‌రిజిస్టర్డ్‌ పర్సన్‌’ అనే కొత్త ఫంక్షన్‌ అందుబాటులో ఉంటుంది. అన్‌రిజిస్టర్డ్‌ కొనుగోలుదారులు, వారి పాన్‌ నంబరు ద్వారా తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసి, ఆ తర్వాత రిజిస్టర్‌ అయిన సప్లయర్‌కు సంబంధించి ఏ ఇన్‌వాయిస్‌ వాపసు క్లెయిం చేయాలనుకుంటున్నారో దాని సంబంధిత రాష్ట్రం/యూటీని ఎంచుకోవాలి. ఆధార్‌ అథంటికేషన్‌ పూర్తి చేసి, ఆ తర్వాత వాపసు పొందాలనుకుంటున్న బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేయాలి. 

టైమ్‌ లిమిట్‌..

సర్క్యులర్‌ ప్రకారం ఫ్లాట్‌, నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌ లేదా దీర్ఘకాలిక బీమా పాలసీ రద్దుకు సంబంధించి, అన్‌రిజస్టర్డ్‌ వ్యక్తులూ.. చెల్లించిన జీఎస్‌టీని తిరిగి పొందవచ్చు. అయితే ఇందుకు టైమ్‌ లిమిట్‌ ఉంది. పన్ను వాపసుకు ఇన్‌వాయిస్‌ తేదీ నుంచి రెండు సంవత్సరాల వ్యవధిలో దరఖాస్తు దాఖలు చేయాలి. దీర్ఘకాలిక బీమా ఒప్పందాలు, బిల్డర్లతో ఒప్పందాల విషయంలో సేవా ఒప్పందం రద్దయిన నాటి నుంచి రెండేళ్ల లోపు దాఖలు చేయవచ్చు. వస్తు, సేవలు సరఫరా జరగని చోట, కొనుగోలుదారులపై అనవసరమైన వ్యయ భారాన్ని తగ్గించేందుకు జీఎస్‌టీ కౌన్సిల్‌ తాజా నిర్ణయం సహాయపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని