EPFO: ఈపీఎఫ్‌ఓ పథకాలకు ఎవర్ని నామినీలుగా నియమించవచ్చు?
సభ్యులు మెంబర్స్ సైట్, ఈ-నామినేషన్ ద్వారా ఎన్నిసార్లైనా నామినేషన్ వేయవచ్చు. అయితే చివరి నామినేషన్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ చందాదారుల కోసం ప్రావిడెండ్ ఫండ్ (EPF), పెన్షన్ ఫండ్ (EPS), బీమా (ఎంప్లాయిస్ డిపాజిట్ లింకెడ్ ఇన్సురెన్స్-EDLI) వంటి ప్రయోజనాలను అందిస్తోంది. ఒకవేళ ఈపీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే.. వీటి ప్రయోజనాలు నామినీ లేదా ఆధారిత కుటుంబ సభ్యులకు అందుతాయి. కాబట్టి ఈ పథకాలకు నామినీలు కీలకం.
సాధారణంగా ఉద్యోగులు ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్/ ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్‌లో చేరినప్పుడే వారి నామినీ (పీఎఫ్ మొత్తం, సంబంధిత వడ్డీ మొత్తం.. పెన్షన్ పొందేందుకు) నియమిస్తుంటారు. ఈపీఎఫ్‌ఓ సభ్యులు వివాహితులు అయినా/ కాకపోయినా, కుటుంబ సభ్యులు లేని వారు కూడా నామినీని నియమించుకోవచ్చు. ఈపీఎఫ్‌ఓ సభ్యుడు ఉద్యోగంలో ఉండగా మరణించినప్పుడు మాత్రమే ఈడీఎల్‌ఐ కింద బీమా లభిస్తుంది. సభ్యులు నామినేషన్‌ను ఆన్‌లైన్‌లో దాఖలు చేసేందుకు ఈపీఎఫ్‌ఓ అనుమతిస్తుంది. ఒకరి కంటే ఎక్కువ మందిని కూడా నామినీలుగా నియమించవచ్చు. అయితే, ఒకరి కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నప్పుడు ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో కూడా నిర్ణయించి తెలపాల్సి ఉంటుంది.
- వివాహం కాని వారు (కుటుంబ సభ్యులు ఉంటే).. ఈపీఎఫ్/ఈడీఎల్‌ఐ కోసం.. అతడి/ఆమె ఆధారిత తల్లిదండ్రులను నామినీగా నియమించవచ్చు. ఈపీఎఫ్ కోసం ఎవరినైనా నామినీగా ఉంచొచ్చు.
- వివాహం కాని వారు (కుటుంబ సభ్యులు లేకపోతే).. ఈపీఎఫ్/ఈడీఎల్‌ఐ స్కీమ్ కోసం ఎవరైనా వ్యక్తి (బంధువు అయినా/కాకపోయినా) లేదా సంస్థను నామినీగా నియమించవచ్చు. ఈపీఎస్ కోసం ఎవరినైనా నామినీగా నియమించవచ్చు.
- ఈపీఎఫ్ సభ్యుడు వివాహం అయివుంటే.. ఈపీఎఫ్/ఈడీఎల్‌ఐ పథకం కోసం పురుష సభ్యులు నామినీలుగా.. భార్య/పిల్లలు; ఆధారిత తల్లిదండ్రులు; కుమారుడు మరణించినట్లయితే కుమారుని భార్య, పిల్లలను నామినీలుగా నియమించవచ్చు.
- ఈపీఎస్ స్కీమ్ కోసం.. అతడి భార్య, పిల్లలు(మరణానికి ముందు ఉద్యోగంలో ఉండగా చట్టపరంగా దత్తత తీసుకున్న పిల్లలూ అర్హులే)
- ఈపీఎఫ్ సభ్యులు మహిళ అయితే.. ఆమె భర్త/పిల్లలు; ఆధారిత తల్లిదండ్రులు; భర్త ఆధారిత తల్లిదండ్రులు; కుమారుడు మరణించినట్లయితే కుమారుని భార్య, పిల్లలను నామినీలుగా నియమించవచ్చు.
- ఈపీఎస్ స్కీమ్ కోసం.. ఆమె భర్త, పిల్లలు (మరణానికి ముందు ఉద్యోగంలో ఉండగా చట్టపరంగా దత్తత తీసుకున్న పిల్లలూ అర్హులే)
గుర్తుంచుకోండి..
-
నామినీలుగా పేర్కొనే సమయానికి సభ్యుడికి కుటుంబం ఉంటే.. అతడి కుటుంబంలోని ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులకు అనుకూలంగా నామినీ ఉండాలి. లేదంటే నామినీ చెల్లదు.
-
సభ్యుడు వివాహం అయిన తర్వాత కొత్త నామినీని పేర్కొనాలి. వివాహానికి ముందు నాటి నామినేషన్‌ను పరిగణనలోకి తీసుకోరు.
-
నామినేషన్ సమయంలో సభ్యుడికి కుటుంబం లేకుంటే.. ఏదైనా వ్యక్తి లేదా వ్యక్తుల పేరుమీద నామినీగా పేర్కొనవచ్చు. ఒకవేళ ఆ తర్వాత కుటుంబం వృద్ధి చెందినట్లయితే ముందు వేసిన నామినేషన్ చెల్లుబాటు కాదు. కొత్త నామినీ సమర్పించాలి.
-
సభ్యులు మెంబర్స్ సైట్, ఇ-నామినేషన్ ద్వారా ఎన్నిసార్లైనా నామినీలను పేర్కొనవచ్చు. అయితే, చివరి నామినేషన్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
D Srinivas: సొంతగూటికి డీఎస్.. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Malla Reddy: నన్ను పవన్ కల్యాణ్ సినిమాలో విలన్‌గా అడిగారు: మల్లారెడ్డి
-
Politics News
Vundavalli Sridevi: జగన్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయింది: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
-
Movies News
NTR: ఎన్టీఆర్ పిల్లలకు అలియా భట్ సర్ప్రైజ్ గిఫ్ట్ .. తనకూ కావాలని కోరిన తారక్
-
World News
Washington: వాషింగ్టన్లో భారత దౌత్యకార్యాలయంపై దాడి కుట్రను భగ్నం చేసిన సీక్రెట్ సర్వీస్