ఐపీఓ వాచ్‌: ఐదు సబ్‌స్క్రిప్షన్లు.. నాలుగు లిస్టింగ్‌లు

IPO Watch: ఈ వారం ఐదు సంస్థలు  ఐపీఓలకు రానున్నాయి. రూ.1680 కోట్లు సమీకరించనున్నాయి. ఇందులో రెండు మెయిన్‌బోర్డు సెగ్మెంట్‌లో వస్తున్నాయి.

Published : 14 Jan 2024 20:51 IST

IPO Watch | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఓల సందడి వచ్చే వారం కూడా కొనసాగనుంది. సోమవారం నుంచి ఐదు ఐపీఓలు ప్రారంభం కానున్నాయి. మొత్తం రూ.1,680 కోట్లు మార్కెట్ల నుంచి ఆయా సంస్థలు సమీకరించనున్నాయి. ఇందులో రెండు మెయిన్‌బోర్డ్‌ ఐపీఓలు కాగా.. మూడు ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో సబ్‌స్క్రిప్షన్‌కు వస్తున్నాయి. మరో నాలుగు కంపెనీలు ఈ వారమే లిస్టింగ్‌కు రానున్నాయి. ఆ వివరాలు ఇవీ..

మెడి అసిస్ట్‌ ఐపీఓ: మెయిన్‌బోర్డ్‌ సెగ్మెంట్‌లో మెడి అసిస్ట్‌ హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ ఐపీఓ ఈ నెల 15న ప్రారంభమై 17న ముగియనుంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణి రూ.397-418గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.1,172 కోట్లు సమీకరించనుంది. రిటైల్‌ మదుపర్లు కనీసం 35 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇష్యూలో భాగంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 2.8 కోట్ల వరకు ఈక్విటీ షేర్లను ప్రస్తుత వాటాదార్లు, ప్రమోటర్లు విక్రయించనున్నారు.

ఎపాక్‌ డ్యూరబుల్‌ ఐపీఓ: ఎపాక్‌ డ్యూరబుల్‌ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ జనవరి 19 నుంచి ప్రారంభం కానుంది. 23న ముగియనుంది. ధరల శ్రేణి వెల్లడి కావాల్సి ఉంది. ఏసీల ఒరిజినల్‌ డిజైన్‌ మాన్యూఫ్యాక్చరర్‌ అయిన ఈ కంపెనీ.. రూ.400 కోట్లు ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా, 1.04 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించనుంది.

  • ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో మ్యాక్స్‌పోజర్‌ సంస్థ ఐపీఓకు వస్తోంది. జనవరి 15-17 తేదీల్లో సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది. రూ.20.26 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరించనుంది. ధరల శ్రేణి రూ.31-33.
  • కాన్‌స్టెలెక్ ఇంజనీర్స్ సైతం ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లోనే ఐపీఓకు వస్తోంది. జనవరి 19 -23 తేదీల్లో సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది. రూ.28.70 కోట్లు సమీకరించనుంది. ధరల శ్రేణి రూ.66-70.
  • దిల్లీకి చెందిన అడిక్టివ్‌ లెర్నింగ్‌ టెక్నాలజీ (లాసికో) ఐపీఓ (SME) జనవరి 19-23 తేదీల్లో సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది. ధరల శ్రేణి రూ.130-140గా నిర్ణయించారు.

గత వారం మెయిన్‌బోర్డు సెగ్మెంట్‌లో ఐపీఓకు వచ్చిన జ్యోతి సీఎన్‌సీ ఆటోమోటివ్‌ సంస్థ జనవరి 16న స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ కానుంది. ఈ ఐపీఓకు 38.6 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో వచ్చిన ఐబీఎల్‌ ఫైనాన్స్‌ 16నే లిస్ట్‌ అవ్వనుంది. ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో వచ్చిన న్యూ స్వాన్‌ మల్టీటెక్‌, ఆస్ట్రేలియన్‌ ప్రీమియం సోలార్‌ జనవరి 18న లిస్ట్‌ కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని