హైదరాబాద్‌లో లులు మాల్‌

హైదరాబాద్‌లో లులు మాల్‌ను వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు యూఏఈ కేంద్రంగా ఉన్న లులు గ్రూపు ప్రకటించింది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న ఒక మాల్‌ను పునరుద్ధరణ (రీఫర్బిషింగ్‌) చేసి, 2023 ప్రారంభంలో అందుబాటులోకి తీసుకొస్తామని లులు గ్రూపు షాపింగ్‌ మాల్స్‌

Published : 16 Aug 2022 03:18 IST

దిల్లీ: హైదరాబాద్‌లో లులు మాల్‌ను వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు యూఏఈ కేంద్రంగా ఉన్న లులు గ్రూపు ప్రకటించింది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న ఒక మాల్‌ను పునరుద్ధరణ (రీఫర్బిషింగ్‌) చేసి, 2023 ప్రారంభంలో అందుబాటులోకి తీసుకొస్తామని లులు గ్రూపు షాపింగ్‌ మాల్స్‌ డైరెక్టర్‌ శిబు ఫిలిప్స్‌ వెల్లడించారు. దేశంలోని కోచి, త్రివేండ్రం, త్రిస్సూర్‌, బెంగళూరు, లఖ్‌నవూలలో కలిసి 37 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్‌ను రూ.7వేల కోట్లతో నెలకొల్పినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్‌ సహా మరికొన్ని నగరాల్లో 12 కొత్త మాల్స్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ‘దేశంలో యువ జనాభా అధికంగా ఉంది. తలసరి ఆదాయం, కొనుగోలు శక్తి పెరుగుతోంది. సంఘటిత రంగంలో ఉన్న రిటైల్‌ మార్కెట్‌ 12 శాతానికి మించి లేదు. కాబట్టి ఇంకా విస్తరణకు వీలుంద’ని విశ్వసిస్తున్నామన్నారు.  కేరళలోని పెద్ద జిల్లాల్లో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు.  చెన్నై, అహ్మదాబాద్‌, ప్రయాగ్‌రాజ్‌, వారణాసి, బెంగళూరు, నోయిడాల్లో కొత్త మాల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అహ్మదాబాద్‌, చెన్నైలలో 10 లక్షల చ.అ.విస్తీర్ణంలో మాల్స్‌ ఉంటాయని పేర్కొన్నారు. వీటికోసం ఎంత పెట్టుబడి పెడుతున్నదీ త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని