10 కిలోల పెంపుడు జంతువు క్యాబిన్‌లోనే

తమ దేశీయ విమానాల క్యాబిన్‌లో 10 కిలోల లోపున్న పెంపుడు జంతువులను అనుమతిస్తున్నట్లు ఆకాశ ఎయిర్‌ ప్రకటించింది. ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నాకే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

Published : 09 May 2024 01:53 IST

ఆకాశ ఎయిర్‌

దిల్లీ: తమ దేశీయ విమానాల క్యాబిన్‌లో 10 కిలోల లోపున్న పెంపుడు జంతువులను అనుమతిస్తున్నట్లు ఆకాశ ఎయిర్‌ ప్రకటించింది. ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నాకే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. 2022 నవంబరులో ఈ విమానయాన సంస్థ పెంపుడు పిల్లులు, శునకాలను ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లేందుకు వీలు కల్పించింది. వాటి బరువు ఆధారంగా క్యాబిన్‌ లేదా కార్గోలో వీటిని అనుమతించేది. ఈ సేవలను విస్తరించడంలో భాగంగా 10 కిలోల (కంటైనర్‌ సహా) వరకూ బరువు ఉండే వాటిని క్యాబిన్‌లోనే తీసుకెళ్లేందుకు అవకాశం కల్పిస్తూ తాజాగా నిర్ణయించింది. ఇప్పటివరకు ఇది 7 కిలోలుగా ఉంది. కార్గోలో 32 కిలోల వరకు బరువున్న పెంపుడు జంతువులకు ఆకాశ ఎయిర్‌ అనుమతిస్తోంది. 2022 నవంబరులో ఈ సేవలను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 3,200లకు పైగా పెంపుడు జంతువులు తమ విమానాల్లో ప్రయాణించినట్లు తెలిపింది.

ఆకాశ ఎయిర్‌తోపాటు ఎయిర్‌ ఇండియా కూడా పెంపుడు జంతువులను క్యాబిన్‌లో, స్పైస్‌జెట్‌ కార్గోలో అనుమతిస్తున్నాయి. ఇండిగో, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఇప్పటి వరకు ఈ సేవలను అందించడం లేదు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ జంతువులను అనుమతినిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని