400 మంది ఇంజినీర్ల నియామకాలు: కోటక్‌ బ్యాంక్‌

ఈ ఏడాది దాదాపు 400 మంది ఇంజినీర్లను నియమించుకునేందుకు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సన్నాహాలు చేస్తోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తనిఖీల్లో వెలుగు చూసిన సాంకేతిక లోపాలు సరిదిద్దేందుకు, టెక్నాలజీ వ్యవస్థలను అప్‌గ్రేడ్‌ చేయాలని బ్యాంక్‌ భావిస్తోంది.

Published : 09 May 2024 01:53 IST

దిల్లీ: ఈ ఏడాది దాదాపు 400 మంది ఇంజినీర్లను నియమించుకునేందుకు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సన్నాహాలు చేస్తోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తనిఖీల్లో వెలుగు చూసిన సాంకేతిక లోపాలు సరిదిద్దేందుకు, టెక్నాలజీ వ్యవస్థలను అప్‌గ్రేడ్‌ చేయాలని బ్యాంక్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇంజినీర్ల నియామకాలు చేపట్టనుంది. గత రెండేళ్లలో 500 మందికి పైగా ఇంజినీర్లను చేర్చుకున్నట్లు బ్యాంక్‌ చీఫ్‌ టెక్నాలజీ అధికారి మిలింద్‌ నగ్నుర్‌ తెలిపారు. గూగుల్‌, అమెజాన్‌, పేటీఎం, ఫోన్‌పే వంటి సంస్థల నుంచి వచ్చిన ఉద్యోగులు ఇందులో ఉన్నారని వెల్లడించారు. ఈ ఏడాదిలో చేపట్టనున్న నియామకాలతో బ్యాంక్‌లో నిపుణుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. డిజిటల్‌ చానెళ్ల ద్వారా కొత్త ఖాతాదారులను చేర్చుకోవద్దని, క్రెడిట్‌ కార్డులు కొత్తగా జారీ చేయరాదని ఆర్‌బీఐ గత నెలలో బ్యాంక్‌పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని