నగదు రుణాలు రూ.20వేల లోపే!

నగదు రూపంలో ఇచ్చే రుణాలు రూ.20వేలకు మించకుండా ఉండాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. నగదు లావాదేవీల విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆర్‌బీఐ పేర్కొందని తెలుస్తోంది.

Published : 09 May 2024 01:55 IST

ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ ఆదేశాలు

ముంబయి: నగదు రూపంలో ఇచ్చే రుణాలు రూ.20వేలకు మించకుండా ఉండాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. నగదు లావాదేవీల విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆర్‌బీఐ పేర్కొందని తెలుస్తోంది. ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనల్లోని సెక్షన్‌ 269ఎస్‌ఎస్‌ ప్రకారం ఒక వ్యక్తికి రూ.20వేలకు మించి నగదు రూపంలో రుణం ఇవ్వకూడదనే నిబంధన ఉందని గుర్తు చేసింది. అందువల్ల ఎన్‌బీఎఫ్‌సీలు ఈ పరిమితికి మించి నేరుగా నగదు రుణాలు ఇవ్వకూడదని పేర్కొంది. చట్టపరమైన నిబంధనను ఉల్లంఘిస్తూ.. ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌, నగదు రూపంలో రుణాలు ఇవ్వడంతో పాటు, వసూలు చేసినట్లుగా తేలడంతో, ఆర్‌బీఐ మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించేందుకు ఆర్‌బీఐని సంప్రదిస్తే, ఎలాంటి సమాధానమూ రాలేదని వార్తా సంస్థ రాయిటర్స్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని