ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో గూగుల్‌ వాలెట్‌ యాప్‌

భారత్‌లో ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే మొబైల్స్‌ కోసం గూగుల్‌ వాలెట్‌ యాప్‌ను టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఆవిష్కరించింది. బోర్డింగ్‌ పాసులు, లాయల్టీ కార్డులు, టికెట్లు, ప్రభుత్వ రవాణా పాసులు.. తదితరాలను భద్రంగా నిల్వ చేసుకునేందుకు ఈ వాలెట్‌ వీలు కల్పిస్తుంది.

Published : 09 May 2024 01:56 IST

దిల్లీ: భారత్‌లో ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే మొబైల్స్‌ కోసం గూగుల్‌ వాలెట్‌ యాప్‌ను టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఆవిష్కరించింది. బోర్డింగ్‌ పాసులు, లాయల్టీ కార్డులు, టికెట్లు, ప్రభుత్వ రవాణా పాసులు.. తదితరాలను భద్రంగా నిల్వ చేసుకునేందుకు ఈ వాలెట్‌ వీలు కల్పిస్తుంది. బుధవారం నుంచే ఈ డిజిటల్‌ వాలెట్‌ అందుబాటులోకి వచ్చిందని గూగుల్‌ జీఎమ్‌, ఇండియా ఇంజినీరింగ్‌ లీడ్‌ రామ్‌ పాపట్ల పేర్కొన్నారు. ‘గూగుల్‌ పే మా ప్రాథమిక చెల్లింపు యాప్‌గా కొనసాగుతుంది. గూగుల్‌ వాలెట్‌ అనేది చెల్లింపేతర సేవల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చామ’ని తెలిపారు.

ఈ బ్రాండ్లతో భాగస్వామ్యం: కొత్త సేవల కోసం ఎయిరిండియా, ఇండిగో, ఫ్లిప్‌కార్ట్‌, పైన్‌ ల్యాబ్స్‌, కొచ్చి మెట్రో, పీవీఆర్‌, ఐనాక్స్‌ వంటి 20 భారతీయ బ్రాండ్లతో గూగుల్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. రాబోయే కొద్ది నెలల్లో మరిన్ని బ్రాండ్లనూ జత చేసుకోనున్నట్లు రామ్‌ తెలిపారు. 

ఇవీ దాచుకోవచ్చు: సినిమా/ఈవెంట్‌ టికెట్లు, బోర్డింగ్‌పాసులు, మెట్రో టికెట్లు, కార్పొరేట్‌ బ్యాడ్జ్‌లు, భౌతిక పత్రాల డిజిల్‌ వర్షన్‌లను ఈ వాలెట్‌లో దాచుకోవచ్చు. 

ఆల్‌-ఇన్‌-ఒన్‌ యాప్‌ త్వరలో: త్వరలోనే చెల్లింపులు, చెల్లింపేతర సేవలు కలగలిపి ఒకే యాప్‌(ఆల్‌ ఇన్‌ ఒన్‌)లో తీసుకువచ్చే ఆలోచన కంపెనీకి ఉందని రామ్‌ వివరించారు. భద్రత, గోప్యత పునాదులపై గూగుల్‌ వాలెట్‌ను నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుతం 80 దేశాల్లో గూగుల్‌ వాలెట్‌ సేవలందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని