పదేళ్లలో అన్ని ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ!!

అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)ల ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం 10 ఏళ్ల మార్గసూచీ(రోడ్‌మ్యాప్‌)ని రూపొందించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు సూచించారు. అందు వల్ల అన్ని వర్గాలకు

Updated : 08 Sep 2022 12:51 IST

మార్గ సూచీ రూపొందించాలి: దువ్వూరి సుబ్బారావు

దిల్లీ: అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)ల ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం 10 ఏళ్ల మార్గసూచీ(రోడ్‌మ్యాప్‌)ని రూపొందించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు సూచించారు. అందు వల్ల అన్ని వర్గాలకు అవసరమైన అంచనాలను అందించడానికి ఇది దోహదం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని పీఎస్‌బీల ప్రైవేటీకరణకు బిగ్‌ బ్యాంగ్‌ విధానం సరైనది కాదని, అయితే ఇదే సమయంలో సమస్యను వెనక్కి నెట్టకూడదని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ బ్యాంకులను ఆదర్శవంతంగా ప్రైవేటీకరించడానికి ఒక మార్గసూచీ అవసరమని, కనీసం పదేళ్ల వ్యవధితో ఇది ఉండొచ్చని వివరించారు. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్పొరేటీకరణ గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని, అప్పుడే అవన్నీ ఏకరీతిన ఆర్‌బీఐ నియంత్రణ కిందకు వస్తాయని పేర్కొన్నారు. 2021-22 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం 2 పీఎస్‌బీల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కోసం పాలసీని ఆమోదించిన సంగతి తెలిసిందే. నీతిఆయోగ్‌ కూడా 2 బ్యాంకులు, ఒక బీమా కంపెనీలో పెట్టుబడుల్ని ఉపసంహరించవచ్చని సూచించింది. పీఎస్‌బీలను ప్రైవేటీకరిస్తే, ఆర్థిక వ్యవస్థపై రెండు రకాలుగా ప్రభావం పడుతుందని సుబ్బారావు అభిప్రాయపడ్డారు. బ్యాంకింగ్‌ వ్యవస్థ సామర్థ్యం మెరుగుపడటం సానుకూలమైతే, ప్రాధాన్య రంగాల రుణాల జారీలో రాజీ పడటం ప్రతికూలాంశమని పేర్కొన్నారు. 2020లో ప్రభుత్వం 10 జాతీయ బ్యాంకులను విలీనం చేసి 4 పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేసింది. దీంతో దేశంలో వీటి సంఖ్య 12కు తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని