యూబీఐ ‘ఎథికల్‌ హ్యాకింగ్‌ ల్యాబ్‌’

హైదరాబాద్‌లోని సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ (సీసీఓఈ) లో ‘ఎథికల్‌ హ్యాకింగ్‌ ల్యాబ్‌’ ను యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) ఏర్పాటు చేసింది. బ్యాంకులోని సమాచారం, డిజిటల్‌ ఆస్తులు, ఇతర ముఖ్యమైన వ్యవహారాలను

Published : 24 Sep 2022 02:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ (సీసీఓఈ) లో ‘ఎథికల్‌ హ్యాకింగ్‌ ల్యాబ్‌’ ను యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) ఏర్పాటు చేసింది. బ్యాంకులోని సమాచారం, డిజిటల్‌ ఆస్తులు, ఇతర ముఖ్యమైన వ్యవహారాలను సైబర్‌ మోసాల నుంచి కాపాడేందుకు అనువైన సైబర్‌ రక్షణ వ్యవస్థను రూపొందించడం ఈ ల్యాబ్‌ ఏర్పాటు లోని ప్రధాన లక్ష్యం. యూబీఐ ఎండీ - సీఈఓ ఎ.మణిమేఖలై ఈ ల్యాబ్‌ను ప్రారంభించగా, బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు నితేష్‌ రంజన్, రజనీష్‌ కర్నాటక్, నిధు సక్సేనా పాల్గొన్నారు. డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునే యత్నాల్లో ఉన్నట్లు మణిమేఖలై వివరించారు. సమాచారాన్ని తస్కరించకుండా ‘ఎథికల్‌ హ్యాకింగ్‌ ల్యాబ్‌’ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని