డాక్టర్‌ రెడ్డీస్‌ ఛైర్మన్‌ సతీష్‌రెడ్డికి ‘డాక్టర్‌ కె.అంజిరెడ్డి మెమోరియల్‌ ఫెలోషిప్‌’

‘డాక్టర్‌ కె.అంజిరెడ్డి మెమోరియల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ అఫర్డబుల్‌ బయోఫార్మాస్యూటికల్స్‌’ ను, ముంబయిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐసీటీ), డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఛైర్మన్‌ సతీష్‌రెడ్డికి అందజేసింది.

Published : 04 Feb 2023 01:48 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘డాక్టర్‌ కె.అంజిరెడ్డి మెమోరియల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ అఫర్డబుల్‌ బయోఫార్మాస్యూటికల్స్‌’ ను, ముంబయిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐసీటీ), డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఛైర్మన్‌ సతీష్‌రెడ్డికి అందజేసింది. ఐసీటీ సారథ్యంలో గోవాలో జరిగిన 4వ బయోసిమిలర్‌ వర్క్‌షాప్‌లో ఈ ఫెలోషిప్‌ను సతీష్‌రెడ్డి అందుకున్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ వ్యవస్థాపకుడు కె.అంజిరెడ్డి ఐసీటీ పూర్వ విద్యార్థి. ఆయన పేరుతో ఏర్పాటు చేసిన ఫెలోషిప్‌ ముందుగా సతీష్‌రెడ్డికి లభించింది. ఈ కార్యక్రమంలో యూడీసీటీ (యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్‌ బాంబే) మాజీ డైరెక్టర్‌ ఎం.ఎం.శర్మ, ఐసీటీ వైస్‌ఛాన్సలర్‌ అనిరుద్ధ బాల్‌చంద్ర పండిట్‌, ఎయిమ్స్‌-భోపాల్‌ అధ్యక్షుడు వై.కె.శర్మ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని