ఆర్‌బీఐ రెపో రేటు 0.25% పెంచొచ్చు

దేశీయంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం శాంతిస్తుండటం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లపై మధ్యస్థ వైఖరి ప్రదర్శిసుండటంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్ల మేర పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Published : 06 Feb 2023 02:25 IST

విశ్లేషకుల అంచనా

ముంబయి: దేశీయంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం శాంతిస్తుండటం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లపై మధ్యస్థ వైఖరి ప్రదర్శిసుండటంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్ల మేర పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను బుధవారం ప్రకటిస్తారు. గత డిసెంబరు పరపతి సమీక్షలో ఆర్‌బీఐ 35 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును పెంచి 6.25 శాతానికి చేర్చింది. అంతకు ముందు వరుసగా 3 సమీక్షల్లో 50 బేసిస్‌ పాయింట్ల మేర పెంచిన సంగతి తెలిసిందే. గత ఏడాది మే నుంచి 225 బేసిస్‌ పాయింట్లు రెపో రేటు పెంచిన ఆర్‌బీఐ తాజాగా మరో 25 బేసిస్‌ పాయింట్లు పెంచడం ద్వారా 6.5 శాతానికి చేర్చే అవకాశం కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని