హైదరాబాద్‌ విమానాశ్రయ ప్రాంగణంలో గోదామును విక్రయించిన జీఎంఆర్‌ గ్రూపు

శంషాబాద్‌లోని విమానాశ్రయ ప్రాంగణంలో 8.18 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదామును కలిగి ఉన్న జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అస్సెట్స్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఏఏఎల్‌)లో నూరు శాతం ఈక్విటీ వాటాను జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) విక్రయించింది.

Published : 07 Jun 2023 03:26 IST

లావాదేవీ విలువ రూ.188.1 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: శంషాబాద్‌లోని విమానాశ్రయ ప్రాంగణంలో 8.18 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదామును కలిగి ఉన్న జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అస్సెట్స్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఏఏఎల్‌)లో నూరు శాతం ఈక్విటీ వాటాను జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) విక్రయించింది. లాజిస్టిక్స్‌, పారిశ్రామిక స్థిరాస్తి నిర్వహణ కార్యకలాపాల్లో నిమగ్నమైన సింగపూర్‌ సంస్థ ఇండోస్పేస్‌ కోర్‌ పీఈటీ లిమిటెడ్‌ అనుబంధ ఐఎల్‌పీ కోర్‌ వెంచర్స్‌కు దీన్ని విక్రయించినట్లు జీఎంఆర్‌ గ్రూపు వెల్లడించింది. ఈ లావాదేవీ విలువ రూ.188.1 కోట్లు. దీంతో ఈ గోదామును ఐఎల్‌పీ కోర్‌ వెంచర్స్‌కు అప్పగించినట్లు అవుతోందని జీఎంఆర్‌ గ్రూపు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని