హైదరాబాద్‌లో విక్రయం కావాల్సిన ఇళ్లు 5% పెరిగాయ్‌

ఈ ఏడాది మార్చి త్రైమాసికంతో పోలిస్తే, జూన్‌ త్రైమాసికం చివరకు హైదరాబాద్‌లో విక్రయం కావాల్సిన ఇళ్లు/ఫ్లాట్లు 5% పెరిగినట్లు డేటా విశ్లేషణా సంస్థ ప్రాప్‌ఈక్విటీ తెలిపింది.

Updated : 14 Aug 2023 07:29 IST

దిల్లీ: ఈ ఏడాది మార్చి త్రైమాసికంతో పోలిస్తే, జూన్‌ త్రైమాసికం చివరకు హైదరాబాద్‌లో విక్రయం కావాల్సిన ఇళ్లు/ఫ్లాట్లు 5% పెరిగినట్లు డేటా విశ్లేషణా సంస్థ ప్రాప్‌ఈక్విటీ తెలిపింది. అమ్ముడవ్వాల్సిన ఇళ్ల సంఖ్య 95,106 నుంచి 99,989 కి పెరిగింది. దేశంలోని 9 ప్రధాన నగరాలన్నీ కలిపితే మాత్రం ఈ సంఖ్య 5,26,914 నుంచి 2% తగ్గి 5,15,169కి పరిమితమైందని ఆ నివేదిక పేర్కొంది. కొన్ని నగరాల్లో అమ్ముడవ్వాల్సిన ఇళ్ల సంఖ్య తగ్గితే, మరికొన్ని నగరాల్లో పెరిగాయి. జూన్‌ త్రైమాసికంలో ఇళ్ల సరఫరాలు 1,10,468గా ఉంటే, విక్రయాలు 1,22,213కు చేరినట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని