జనరల్‌ మోటార్స్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ టి.ఎన్‌. సుబ్రమణియమ్‌ కన్నుమూత

భారత సంతతికి చెందిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, అమెరికా వాహన దిగ్గజం జనరల్‌ మోటార్స్‌ (జీఎం) వ్యవస్థాపక డైరెక్టర్‌ అయిన డాక్టర్‌ టి.ఎన్‌. సుబ్రమణియమ్‌(76) కన్నుమూశారు.

Published : 27 Mar 2024 01:12 IST

ప్రసిద్ధ గణితశాస్త్రవేత్త ఈయన

న్యూయార్క్‌: భారత సంతతికి చెందిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, అమెరికా వాహన దిగ్గజం జనరల్‌ మోటార్స్‌ (జీఎం) వ్యవస్థాపక డైరెక్టర్‌ అయిన డాక్టర్‌ టి.ఎన్‌. సుబ్రమణియమ్‌(76) కన్నుమూశారు. అమెరికాకు 1979లో వలస వెళ్లిన సుబ్రమణియమ్‌ మనదేశంతో పాటు అమెరికాలోని విద్యాధికులకు బాగా తెలిసిన వ్యక్తి. పలు గణిత నమూనాలు, సిద్ధాంతాలను ఆయన కనిపెట్టారు. జీఎమ్‌ కార్లకు గణిత నమూనాలను తీసుకురావడం కోసం జనరల్‌ మోటార్స్‌ ఈయన్ని నియమించుకుంది. ఆ తర్వాత రూట్‌ వన్‌ కంపెనీని ఆయన ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ జీఎమ్‌ కార్లకు, జీపీఎస్‌ సిస్టమ్స్‌కు ఆటో ఫైనాన్సింగ్‌ చేస్తోంది. అమెరికా పర్యటనలో భాగంగా అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ సుబ్రమణియమ్‌ను వ్యక్తిగతంగా కలిసి.. దేశం గర్వించదగ్గ పనులు చేయాలని ప్రోత్సహించారు కూడా. సుబ్రమణియమ్‌కు భార్య, కుమార్తె, అల్లుడు ఉన్నారు. ఈయన తమ్ముడు టీఎన్‌ అశోక్‌.. ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా(పీటీఐ)కు ఎడిటర్‌ (ఎకనామిక్స్‌)గా పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని