ప్రపంచ 500 మంది కుబేరుల్లో ట్రంప్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు అన్నీ కలిసొస్తున్నట్లున్నాయి. తాజాగా బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో ప్రపంచంలోనే తొలి 500 మంది సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Published : 27 Mar 2024 01:14 IST

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు అన్నీ కలిసొస్తున్నట్లున్నాయి. తాజాగా బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో ప్రపంచంలోనే తొలి 500 మంది సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. సోమవారం అమెరికా మార్కెట్‌ ముగిసే సమయానికి ట్రంప్‌ సంపద విలువ 4.18 బి.డాలర్లు (రూ.33,000 కోట్లు) పెరిగి 6.53 బి.డాలర్లకు చేరింది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆయన కంపెనీ డీల్‌ ఒకటి తాజాగా పూర్తయినందునే, ఆయన ఆస్తుల విలువ భారీగా పెరిగింది. గతంలో ఎన్నడూ ఆయన ఆస్తుల విలువ ఈ స్థాయిలో లేదని యూఎస్‌ఏ టుడే పేర్కొంది. ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ షేరు మంగళవారం నాస్‌డాక్‌లో 50 శాతానికి పైగా ప్రీమియంతో నమోదవ్వడం మరింతగా కలిసొచ్చింది. ఈ కంపెనీ మార్కెట్‌ విలువ 10 బి. డాలర్ల వరకు చేరింది. ట్రంప్‌నకు ఈ కంపెనీలో మెజారిటీ వాటా (59%) ఉండడంతో ఆయన సంపదా మరింతగా పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని