VLC media player: వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌పై నిషేధం ఎత్తివేత

దేశంలో నిషేధానికి గురైన వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ (VLC player) తిరిగి అందుబాటులోకి వచ్చింది. దీనిపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎత్తివేసింది.

Published : 15 Nov 2022 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో నిషేధానికి గురైన వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ (VLC player) తిరిగి అందుబాటులోకి వచ్చింది. దీనిపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎత్తివేసింది. దీంతో  మునుపటిలానే నెటిజన్లు ఈ వెబ్‌సైట్‌/యాప్‌ను వినియోగించుకోవచ్చు.

భద్రతా కారణాల రీత్యా దీనిపై భారత ప్రభుత్వం  నిషేధం విధించింది. గతంలో నిషేధానికి గురైన సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన సర్వర్‌తో వీఎల్‌సీ ప్లేయర్‌ అనుసంధానం అవుతున్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్రం బ్యాన్‌ను ఎత్తివేసిందని ఇంటర్నెట్‌ ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌ (IFF) ట్వీట్‌ చేసింది. వీఎల్‌సీ సైతం నిషేధం తొలగిపోయిన విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని