HDFC life insurance: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నికర లాభం ₹376 కోట్లు

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.376 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది.

Published : 13 Oct 2023 17:05 IST

దిల్లీ: ప్రైవేట్‌ రంగ బీమా కంపెనీ.. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 2023-24 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.376 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో పోలిస్తే దాదాపు 15% పెరిగింది. బీమా సంస్థకు సంబంధించిన నికర ప్రీమియం ఆదాయం రూ.14,755 కోట్లుగా ఉంది. ఇది అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.11,479 కోట్లతో పోలిస్తే 28% పెరిగింది. 2023-24 మొదటి అర్ధభాగంలో సంస్థ 4.76 లక్షల పాలసీలను విక్రయించింది. గత సంవత్సరం ఇదే కాలంలో విక్రయించిన పాలసీల సంఖ్య 4.34 లక్షలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని