Hero Karizma XMR: హీరో కరిజ్మా మళ్లీ వస్తోంది.. ఆసక్తిరేపుతున్న టీజర్లు

Hero Karizma XMR: హీరో మోటోకార్ప్‌ తన కరిజ్మా బైక్‌ను మళ్లీ లాంచ్‌ చేస్తోంది. ఆగస్టు 29న ఈ బైక్ రాబోతోంది. దీనికి సంబంధించి హీరో విడుదల చేసిన పలు టీజర్లు ఆకట్టుకుంటున్నాయి.

Published : 25 Aug 2023 14:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero motocorp) తన కరిజ్మా మోడల్‌ను మళ్లీ తీసుకొస్తోంది. 2003లో తొలుత హీరో కరిజ్మాను లాంచ్‌ చేసింది. తర్వాత కరిజ్మా పేరుతో కొన్ని మోడళ్లను రిలీజ్‌ చేసింది. ఇప్పుడు మరోసారి తన టాప్‌ ఎండ్‌ బైక్‌ను కరిజ్మా 210 ఎక్స్‌ఎంఆర్‌ (Hero Karizma XMR) పేరుతో విడుదల చేయనుంది. ఆగస్టు 29న దీన్ని తీసుకురానుంది. ఇప్పటికే బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. గతంలోనూ కరిజ్మాకు ఆయనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించారు.

టీవీఎస్‌ క్రాస్‌ఓవర్‌ ఎక్స్‌

త్వరలో రానున్న హీరో కరిజ్మా ఎక్స్‌ఎంఆర్‌ మోడల్‌కు సంబంధించి హీరో మోటోకార్ప్‌ ఇప్పటికే పలు టీజర్లను విడుదల చేసింది. దాని బట్టి 210 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో ఈ బైక్‌ రానుంది. సిక్స్‌ స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ ఇవ్వనున్నారు. గరిష్ఠంగా 143 కిలోమీటర్ల వేగంతో ఈ బైక్‌ ప్రయాణిస్తుందని తెలుస్తోంది. డ్యూయల్‌ టోన్‌ కలర్‌ థీమ్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌, డ్యూయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌, డిజిటల్‌ ఇన్సుట్రుమెంట్‌ క్లస్టర్‌ వంటివి ఉండనున్నాయి. వెనుక వైపు మోనో సస్పెన్షన్‌, ముందూ వెనుక డిస్క్‌ బ్రేక్స్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ ఆప్షన్‌తో ఈ బైక్‌ రానున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత మళ్లీ తీసుకొస్తున్న ఈ బైక్‌లో ఇంకేమేం ఇస్తున్నారు? ధర ఎంత? వంటి వివరాలు తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని