ICICI Lombard: ఐసీఐసీఐ లాంబార్డ్‌కు రూ.1,728 కోట్ల జీఎస్టీ నోటీసు

ICICI Lombard: జీఎస్టీ డిమాండ్‌ నోటీసులు అందినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఐసీఐసీఐ లాంబార్డ్‌ ధ్రువీకరించింది.

Published : 28 Sep 2023 14:33 IST

దిల్లీ: జీఎస్టీ దర్యాప్తు ఏజెన్సీ డీజీజీఐ రూ.1,728 కోట్లు విలువ చేసే డిమాండ్‌ నోటీసులను ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌కు పంపింది. 2017 జులై నుంచి 2022 మార్చి మధ్య చేసిన కొన్ని సరఫరాలకు సంబంధించి పన్నులు చెల్లించలేదని నోటీసుల్లో పేర్కొంది. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఐసీఐసీఐ లాంబార్డ్‌ నోటీసులు అందినట్లు ధ్రువీకరించింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ పుణె ప్రాంతీయ కార్యాలయం నుంచి ఇవి అందినట్లు తెలిపింది. అయితే, తాము అందుకున్న నోటీసుల్లో పేర్కొన్న సమస్య మొత్తం ఇన్సూరెన్స్‌ పరిశ్రమ ఎదుర్కొంటోందని వివరించింది. తగిన సమాధానం ఇస్తూ నోటీసులపై స్పందిస్తామని కంపెనీ తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని