ITC Market Cap: మార్కెట్‌ విలువపరంగా 7వ అతిపెద్ద కంపెనీగా ఐటీసీ

ఈరోజు (2023, ఏప్రిల్‌ 21) మార్కెట్లు ముగిసే సమయానికి ఐటీసీ షేరు 1.92 శాతం లాభపడి రూ.408 దగ్గర నిలిచింది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (ITC Market Cap) రూ.5.08 లక్షల కోట్లుగా ఉంది.

Published : 21 Apr 2023 19:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ద్రవ్యోల్బణం, గ్రామీణ విక్రయాల్లో తగ్గుదల వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఐటీసీ లిమిటెడ్‌ (ITC Ltd) ఆర్థికంగా దూసుకెళ్తోంది. దీంతో మదుపర్లు ఈ కంపెనీ స్టాక్‌ను తెగ కొంటున్నారు. శుక్రవారం ఇంట్రాడేలో ఈ స్టాక్‌ బీఎస్‌ఈలో రూ.409 దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. గత ఏడాది వ్యవధిలో ఈ స్టాక్‌ విలువ 56 శాతం పుంజుకోవడం విశేషం.

ఐటీసీ లిమిటెడ్‌ మార్కెట్‌ క్యాప్‌ (ITC Market Cap) గురువారం తొలిసారి రూ.5 లక్షల కోట్ల మైలురాయిని అందుకుంది. ఈ స్థాయికి చేరిన 11వ భారత కంపెనీగా ఐటీసీ నిలిచింది. మార్కెట్‌ విలువపరంగా ఈరోజు హెచ్‌డీఎఫ్‌సీని కూడా దాటేసి 7వ అతిపెద్ద దేశీయ సంస్థగా నిలిచింది. నిఫ్టీ50 సూచీలో రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ తర్వాత అత్యధిక వెయిటేజీ ఉన్న కంపెనీగా నిలిచింది. జనవరి నుంచి 22 శాతం పుంజుకున్న ఈ స్టాక్‌ నిఫ్టీ సూచీకి ఆయువుపట్టుగా నిలుస్తోంది.

భవిష్యత్‌లో కంపెనీ ఆర్థికంగా మరింత వృద్ధిని నమోదు చేయనుందన్న వార్తల నేపథ్యంలో కంపెనీ షేరును కొనుగోలు చేయడానికి మదుపర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈరోజు (2023, ఏప్రిల్‌ 21) మార్కెట్లు ముగిసే సమయానికి కంపెనీ షేరు 1.92 శాతం లాభపడి రూ.408 దగ్గర నిలిచింది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (ITC Market Cap) రూ.5.08 లక్షల కోట్లుగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని