IPO Listing: 2024లో తొలి ఐపీఓ లిస్టింగ్‌.. 12% లాభంతో జ్యోతి సీఎన్‌సీ షేర్లు అరంగేట్రం

Jyoti CNC Automation IPO Listing: రూ.1,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో జ్యోతి సీఎన్‌సీ ఐపీఓకి వచ్చింది. ధరల శ్రేణిని రూ.315-331గా నిర్ణయించింది. కంపెనీ షేర్లు ఈరోజు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లలో లిస్టయ్యాయి.

Published : 16 Jan 2024 12:15 IST

Jyoti CNC Automation IPO Listing | దిల్లీ: కొత్త సంవత్సరంలో ఐపీఓకి వచ్చిన తొలి కంపెనీ జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్‌ షేర్లు మంగళవారం    స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి (Jyoti CNC Automation IPO Listing). ఇష్యూ ధర రూ.331తో పోలిస్తే బీఎస్‌ఈలో షేరు 12.38 శాతం లాభంతో రూ.372 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టింది. ఎన్‌ఎస్‌ఈలో 11.78 శాతం ప్రీమియంతో రూ.370 వద్ద అరంగేట్రం చేసింది. గత గురువారం ముగిసిన ఈ ఐపీఓకి 38.53 రెట్ల స్పందన లభించింది.

రూ.1,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో జ్యోతి సీఎన్‌సీ ఐపీఓకి వచ్చింది. ధరల శ్రేణిని రూ.315-331గా నిర్ణయించింది. మదుపర్లు కనీసం 45 షేర్లకు రూ.14,895 పెట్టుబడిగా పెట్టారు. ఈ లెక్కన షేర్లు అలాట్‌ అయినవారు లిస్టింగ్‌లో (Jyoti CNC Automation IPO Listing) ఒక్కో లాట్‌పై రూ.1,755 లాభం పొందారు. ఈ పబ్లిక్‌ ఆఫర్‌లో పూర్తిగా కొత్త షేర్లను మాత్రమే జారీ చేశారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఎలాంటి షేర్లను అందుబాటులో ఉంచలేదు. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, దీర్ఘకాల మూలధనం, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది.

‘కంప్యూటర్‌ న్యూమరికల్‌ కంట్రోల్‌ (CNC)’ యంత్రాలను తయారు చేస్తున్న ప్రముఖ కంపెనీల్లో జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్‌ ఒకటి. ఇస్రో, బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ తిరువనంతపురం లిమిటెడ్‌, టర్కిష్‌ ఏరోస్పేస్‌, ఎంబీడీఏ, యూనిపార్ట్స్‌ ఇండియా, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌, టాటా సికోస్కీ ఏరోస్పేస్‌, భారత్‌ ఫోర్జ్‌, కల్యాణి టెక్నోఫోర్జ్‌, రోలెక్స్‌ రింగ్స్‌ వంటి కంపెనీలు జ్యోతి సీఎన్‌సీ కస్టమర్ల జాబితాలో ఉన్నాయి. 2023 సెప్టెంబర్‌ నాటికి కంపెనీ ఆర్డర్‌ బుక్‌ విలువ రూ.3,315 కోట్లుగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని