Mark Zuckerberg : మార్క్‌ జుకర్‌ బర్గ్‌ మరో ఘనత.. బ్రెజిలియన్‌ యుద్ధ కళలో బ్లూ బెల్ట్‌

మెటా (Meta) సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ (Mark Zuckerberg) బ్రెజిలియన్‌ యుద్ధకళలో ప్రావీణ్యం సంపాదిస్తున్నారు. ఆయన తాజాగా బ్లూ బెల్ట్‌ (Blue Belt) స్థాయికి చేరుకున్నారు.

Published : 24 Jul 2023 17:54 IST

Image : Mark Zuckerberg

ఇంటర్నెట్‌ డెస్క్ : సాంకేతిక రంగంలో పలు విద్యలు తెలిసిన మెటా (Meta) సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ (Mark Zuckerberg) ఇప్పుడు యుద్ధ కళలపై దృష్టి సారించారు. తాజాగా ఆయన బ్రెజిలియన్‌ ‘జు జిట్సు’లో బ్లూ బెల్ట్‌ (Blue Belt) సాధించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ 39 ఏళ్ల కుబేరుడు డేవ్‌ కామారిల్లో అనే కోచ్‌ వద్ద శిక్షణ తీసుకున్నారు. బ్రెజిలియన్‌ జు జిట్సులో ఐదు రకాల బెల్టులుంటాయి. వైట్‌, బ్లూ, పర్పుల్, బ్రౌన్‌ దశలు దాటిన తరువాత బ్లాక్‌ బెల్ట్‌ సొంతమవుతుంది.

‘X.com’ గా ట్విటర్‌.. ఇక మస్క్‌ ఆలోచనలన్నీ ఇక్కడే..?

శిక్షణలో తన విజయం గురించి వివరిస్తూ మెటా సీఈవో పోస్టు పెట్టారు. ‘5వ డిగ్రీ బ్లాక్‌ బెల్ట్‌ సాధించిన డేవ్‌ కామారిల్లోకు శుభాకాంక్షలు. మీరు ఓ గొప్ప శిక్షకుడు. మీ శిక్షణలో నేను పోరాటం, జీవితం గురించి చాలా నేర్చుకున్నాను. బ్లూ బెల్ట్‌ సాధించేలా పదోన్నతి పొందడం గౌరవంగా భావిస్తున్నానని’ అందులో వెల్లడించారు. దానికి కోచ్‌ బదులిస్తూ ‘మీ గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడం గౌరవంగా భావిస్తున్నా. మీ ఆసక్తికి ధన్యవాదాలు. శిక్షణ కాలంలో అద్భుతమైన క్రమశిక్షణ ప్రదర్శించారని’ మార్క్‌ వ్యక్తిత్వాన్ని కొనియాడారు.

ఈ పోస్టులకు మార్క్‌ జుకర్‌ బర్గర్‌ అభిమానులు, ఫాలోవర్ల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ‘బటన్ ఫర్‌ ఎలాన్‌ వర్సెస్‌ జుకర్‌ ఫైట్‌’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్ చేశాడు. ‘వావ్ అమేజింగ్‌.. శుభాకాంక్షలు జుకర్‌ బర్గ్‌. నమ్మలేకపోతున్నాం’ అంటూ మరో నెటిజన్‌ పేర్కొన్నాడు. కొద్ది రోజుల క్రితం ట్విటర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌కు, మార్క్‌ జుకర్‌ బర్గ్‌కు మధ్య కేజ్‌ ఫైట్‌ సాగుతుందన్న నేపథ్యంలో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ తన శరీరాకృతిని ప్రదర్శిస్తున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అప్పట్లో మస్క్‌ తొలుత ‘కేజ్‌ మ్యాచ్‌’ సవాల్‌ విసిరారు. దానికి మెటా సీఈవో బదులిస్తూ ‘లొకేషన్’ పంపించమన్నారు. అయితే ఈ పోరాటం ఎప్పుడు జరగనుందో ఇంత వరకు తెలియరాలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని