ఫరూఖ్‌నగర్‌లో 48 ఎకరాలు కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్‌

మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ (ఇండియా) హైదరాబాద్‌ సమీపంలో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్‌నగర్‌ మండలం ఎలికట్ట గ్రామంలో ఈ భూమిని తీసుకుంది.

Published : 07 May 2024 02:38 IST

హైదరాబాద్‌: మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ (ఇండియా) హైదరాబాద్‌ సమీపంలో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్‌నగర్‌ మండలం ఎలికట్ట గ్రామంలో ఈ భూమిని తీసుకుంది. ఎకరం రూ.5.56 కోట్ల చొప్పున, మొత్తం రూ.267 కోట్లకు ఈ భూమిని కొనుగోలు చేసింది. ఇందులో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. 2022లో మూడు చోట్ల రూ.275 కోట్ల విలువైన భూములను మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేసింది. హైదరాబాద్‌ పరిసరాల్లో 3 డేటా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మైక్రోసాఫ్ట్‌ ప్రకటించిన సంగతి విదితమే. ఇప్పటికే ఒక డేటా కేంద్రం నిర్మాణాన్ని షాద్‌నగర్‌ సమీపంలో చేపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని