ఆంధ్ర, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో డ్రోన్లతో పురుగుమందులు, ఎరువుల పిచికారీ

30 లక్షల ఎకరాల సాగుభూముల్లో పురుగుమందులు, ఎరువుల పిచికారీకి ఇఫ్కోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డ్రోన్‌ కంపెనీ డ్రోన్‌ డెస్టినేషన్‌ తెలిపింది. ఒప్పందం ప్రకారం ఎకరాకు రూ.400-800ను చొప్పున చెల్లిస్తారు.

Published : 07 May 2024 02:41 IST

దిల్లీ: 30 లక్షల ఎకరాల సాగుభూముల్లో పురుగుమందులు, ఎరువుల పిచికారీకి ఇఫ్కోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డ్రోన్‌ కంపెనీ డ్రోన్‌ డెస్టినేషన్‌ తెలిపింది. ఒప్పందం ప్రకారం ఎకరాకు రూ.400-800ను చొప్పున చెల్లిస్తారు. కనిష్ఠ ధర వద్ద రూ.120 కోట్లు, గరిష్ఠ ధర వద్ద రూ.240 కోట్లు  ఆర్జించగలమని డ్రోన్‌ డెస్టినేషన్‌ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో డ్రోన్‌ డెస్టినేషన్‌ ఈ కార్యకలాపాలు చేపట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని