మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ ఆదాయాల్లో వృద్ధి

సెమీకండక్టర్‌, సాఫ్ట్‌వేర్‌, సిస్టమ్‌ డిజైన్‌ సేవల సంస్థ మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ 2023-24 పూర్తి కాలానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.293.91 కోట్ల ఆదాయాన్ని, రూ.9.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

Published : 07 May 2024 02:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: సెమీకండక్టర్‌, సాఫ్ట్‌వేర్‌, సిస్టమ్‌ డిజైన్‌ సేవల సంస్థ మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ 2023-24 పూర్తి కాలానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.293.91 కోట్ల ఆదాయాన్ని, రూ.9.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23తో పోల్చితే ఆదాయం 48%, నికరలాభం 62% పెరిగాయి. మార్చి త్రైమాసికంలో ఈ సంస్థ రూ.75.43 కోట్ల ఆదాయాన్ని,    రూ.7.82 కోట్ల ఎబిటా (వడ్డీ, పన్ను, తరుగుదల, ఇతర కేటాయింపుల కంటే ముందు ఆదాయం) నమోదు చేసింది. మానవ వనరుల అభివృద్ధిపై పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నందున సమీప భవిష్యత్తులో ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించగలుగుతామని మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ ఈ సందర్భంగా పేర్కొంది. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీతో పాటు మనదేశంలోని హైదరాబాద్‌, బెంగళూరు,. అహ్మదాబాద్‌, పుణె కేంద్రాల్లో 1200 మంది నిపుణులు పనిచేస్తున్నట్లు వివరించింది. ఈ కేంద్రాల్లో టర్న్‌కీ డిజిటల్‌, మిక్స్‌డ్‌ సిగ్నల్‌ ఏఎస్‌ఐసీస్‌, డిజైన్‌ సర్వీసెస్‌, సెర్‌డెస్‌ ఐపీ, ఎంబెడెడ్‌ సిస్టమ్‌ డిజైన్‌ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని